అటు ఆయన.. ఇటు ఈయన.. మధ్యలో సీఎస్‌

ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ ప్రకాష్‌ను తప్పించాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ సీఎస్‌ను ఆదేశించారు. కానీ.. ప్రవీణ్‌ ప్రకాష్‌ను బదిలీ చేసేందుకు చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎస్ఈసీ ఆదేశాలను ఆయన అమలు చేయలేదు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో ఘాటు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తాజా లేఖలో ప్రవీణ్ ప్రకాష్ తాను స్వయంగా తప్పు చేశాడని అంగీకరించారని గుర్తు చేశారు. జనవరి 23వ తేదీన ఎన్నికల కమిషన్ […]

Written By: Srinivas, Updated On : January 31, 2021 11:50 am
Follow us on


ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ ప్రకాష్‌ను తప్పించాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ సీఎస్‌ను ఆదేశించారు. కానీ.. ప్రవీణ్‌ ప్రకాష్‌ను బదిలీ చేసేందుకు చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎస్ఈసీ ఆదేశాలను ఆయన అమలు చేయలేదు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో ఘాటు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తాజా లేఖలో ప్రవీణ్ ప్రకాష్ తాను స్వయంగా తప్పు చేశాడని అంగీకరించారని గుర్తు చేశారు.

జనవరి 23వ తేదీన ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. దానికి సీఎస్, డీజీపీనే కాదు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు హాజరు కాలేదు. దీనికి కారణం ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలివ్వడమేనని నిమ్మగడ్డకు తెలిసింది. దీన్నే కారణంగా చెబుతూ ప్రవీణ్ ప్రకాష్ తప్పిదానికి పాల్పడ్డారని.. ఆయన అధికారుల్ని నియంత్రించడం వల్ల మొదటి దశ ఎన్నికలను రీ-షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని రమేష్ కుమార్ చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఎస్ఈసీ లేఖ సీఎస్‌కు అందిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ కూడా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఓ లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేశానని.. తానెక్కడా తప్పు చేయలేదన్నారు. ఈ మాటతోనే అధికారులను సమావేశానికి రాకుండా ఆపిన విషయాన్ని ఆయన అంగీకరించాల్సి వచ్చింది. దీన్నే నిమ్మగడ్డ తన తాజా లేఖలో వివరించి.. చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయకపోతే కోర్ట్ ధిక్కరణ అవుతుందని గుర్తుచేశారు.

ఇక.. ఎన్నికల కోడ్‌ అమలు విషయంలోనూ సీఎస్‌ మరో లేఖను ఎస్ఈసీకి పంపారు. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో నేతలెవరూ అధికారిక వాహనాల్లో తిరగొద్దని వారి వెంట అధికారులు వెళ్లవద్దని ఆదేశించారు. సజ్జల అదే పనిగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తుండటంతో.. ఆయనపైనా కోడ్ ప్రయోగించారు నిమ్మగడ్డ. కేబినెట్ ర్యాంక్‌లో ఉన్న ప్రభుత్వ సలహాదారులు పార్టీ ఆఫీసుల్లో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ తరపున మాట్లాడకూడదని అలా చేస్తే 1994 పంచాయతీరాజ్ చట్టం, 1951 ప్రజా ప్రాతినిధ్యం చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనన్నారు. నిమ్మగడ్డ నుంచి వచ్చి పడుతున్న లేఖలు అధికార పార్టీని చికాకు పెడుతున్నాయి. ఈ వివాదం మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు.