
కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిన్న అధికారికంగా ప్రమాణం చేశారు. గెలిచాక ఆమెతో ఉన్న వారికి కరోనా సోకడంతో కవిత క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. గడువు ముగియడంతో తాజాగా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
కవిత శాసనమండలిలోకి అడుగు పెడుతుండడంతో ఆసక్తిగా మారింది. ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన కూతురును రాష్ట్ర రాజకీయాల్లోకి కేసీఆర్ ఎందుకు తీసుకొచ్చారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనీసం రాజ్యసభకు పంపి అలా అయినా ముచ్చట తీర్చుకోవచ్చు. కానీ అది చేయకుండా రాష్ట్ర రాజకీయాలకు కవితను తీసుకొచ్చారు.
Also Read: కేటీఆర్ దృష్టిలో అసలు రేవంత్ లీడర్ కాదా? హాట్ కామెంట్స్
ఇక కవితకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా? కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రి మల్లారెడ్డికి చెక్ పెట్టి కవితను ఆ ప్లేసులో తీసుకొని మహిళా శిశు సంక్షేమం లేదా వైద్య ఆరోగ్యశాఖను అప్పగిస్తారన్న టాక్ నడుస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళితే కేటీఆర్, కవితలే రాష్ట్ర రాజకీయాలను ఏలుతారన్నది గులాబీ వర్గాల మాట.. అయితే ఇదంతా జరగాలంటే కేంద్రంలో ముందు అస్తిరత ఏర్పడాలి. నరేంద్రమోడీ సర్కార్ ఫుల్ మెజార్టీ ఉండడంతో దానికి ఇంకా సమయం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కవిత భవిష్యత్ ఆధారపడి ఉందన్నది విశ్లేషకుల మాట.
Also Read: దుబ్బాక ఉపఎన్నికపై కేసీఆర్ సంచలన కామెంట్స్
కాగా కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలైంది. నాటి నుంచి ఆమె రాజకీయంగా కొంత సైలంటయ్యారు. తాజాగా కవిత ఎమ్మెల్సీగా గెలుపొందడంతో కేసీఆర్ క్యాబినెట్లో ఆమెకు మంత్రి పదవీ లభిస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే కుమారుడిని సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. కూతురు భవిష్యత్ ను కూడా బంగారుమయం చేస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!
Comments are closed.