తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారా.. లేదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. దీనిపై ఫ్యాన్స్‌తో చర్చించి సోమవారం ఫైనల్ నిర్ణయం ప్రకటించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ‘రజనీ మక్కళ్ మండ్రం’ నిర్వాహకులతో కీలక భేటీ నిర్వహించారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ పెట్టారు.
Also Read: గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్!
అయితూ.. ప్రధానంగా రాజకీయాల్లోకి వచ్చే అంశంపైనే ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని మరోసారి రజినీకాంత్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. మరోసారి రాజకీయాలపై వాయిదా వేశారు. రజనీ నేటి భేటీతో ఆయన ఇంటి ముందు అభిమానులు ముందుగానే పెద్ద ఎత్తున పోటెత్తారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.
Also Read: హైదరాబాద్ లో రోహింగ్యాల వేట మొదలైంది..
మరోవైపు.. తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీ పార్టీ నిర్వాహకులతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబర్ 12న తన పుట్టిన రాజు నాడు కీలక ప్రకటన వెలువడచ్చనే ప్రచారమూ ఊపందుకుంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులూ వాపోతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం: జాతీయం
గతంలోనూ రజనీ రాజకీయ అరంగేట్రంపై చాలాసార్లు ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానని మూడేళ్ల క్రితమే ప్రకటించినా.. ఇప్పటివరకు పార్టీని మాత్రం ప్రారంభించలేదు. అటు క్రియాశీల రాజకీయాల్లోనూ పాల్గొనలేదు. అదే సమయంలో మక్కల్ మండ్రం బలోపేతానికి మాత్రం చర్యలు చేపట్టారు. తరచూ జిల్లాలవారీగా నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. అయితే.. ఇప్పుడైన తన రాజకీయ అరంగేట్రంపై పూర్తిస్థాయి క్లారిటీ ఇస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.