యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 36 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో స్టాటిస్టికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 17వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
Also Read: పదో తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్ష వాయిదా..?
https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఇంజనీరింగ్ విద్యార్థులకు గూగుల్ ఇంటర్న్‌షిప్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. స్టాటిస్టికల్ ఆఫీసర్ (ప్లానింగ్/ స‌్టాటిస్టిక్స్) ఉద్యోగాలకు సంబంధించి 35 ఖాళీలు ఉండగా సూపరింటెండెంట్ (ప్రింటింగ్) ఉద్యోగానికి సంబంధించి ఒకే ఒక్క పోస్ట్ ఉంది. అర్హత, అనుభవానికి తగిన వేతనం లభిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా విజృంభణ తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వరుస నోటిఫికేషన్లువెలువడుతున్నాయి.
మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం
వరుసగా వేర్వేరు ఉద్యోగాలకు సంబంధించి వెలువడుతున్న నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. కేంస్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భవిష్యత్తు బాగుంటుందని చెప్పవచ్చు.