Homeఆంధ్రప్రదేశ్‌‘ఆర్ఆర్ఆర్’ సవాల్ ను జగన్ స్వీకరిస్తాడా?

‘ఆర్ఆర్ఆర్’ సవాల్ ను జగన్ స్వీకరిస్తాడా?

is Jagan making a mistake by giving priority to those leaders
ఏపీ రాజకీయం మొత్తం ‘రాజధాని’ చుట్టే తిరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి రాజధానిగా అమరావతి ప్రకటించారు. అయితే ఐదేళ్ల కాలంలోనూ ఆయన రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: విజయసాయి, రోజా టాక్ వైసీపీకి రివర్స్ అవుతోందా?

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా సీఎం జగన్ ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు యత్నించడంతో రాజకీయ చిచ్చును రాజేసింది. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతి శాసన రాజధాని, విశాఖను పరిపాలన, కర్నూలును లెజిస్టేటీవ్ రాజధానిగా ప్రకటించారు. అందుకనుగుణంగా జగన్ సర్కార్ ముందుకెళుతోంది.

జగన్ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ మాత్రం ఏపీకి జిల్లాకో రాజధాని పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదని ఈ అంశం నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. అయితే రాజధాని విషయంలో మాత్రం ప్రతిపక్షాలు జగన్ ను విమర్శిస్తూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు(ఆర్ఆర్ఆర్) అమరావతి రాజధాని విషయంలో జగన్ కు  బహిరంగ సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: టీడీపీ గతే వైసీపీకి పడుతుందా?

సీఎం జగన్ అమరావతి నుంచి రాజధానిని తరలిండం కరెక్ట్ కాదని అనేకసార్లు రఘరామకృష్ణ బహిరంగగానే ప్రకటించారు. కాగా తాను నర్సాపురం ఎంపీగా రాజీనామా చేస్తానని.. దీనిని అమరావతి రాజధానికి రెఫరెండంగా జగన్ ప్రకటించాలని కోరారు. జగన్ ఆదేశిస్తే అమరావతి కోసం తాను రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీని ద్వారా రాజధాని అమరావతిగా ఉండాలా? లేదంటే ఏపీకి మూడురాజధానులు ఉండాలనే అనే అంశం తేలిపోతుందని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక వల్ల జగన్ సర్కార్ వచ్చే నష్టం కూడా లేదని తెలిపారు. దీంతో నర్సాపురం ఉప ఎన్నిక ద్వారా జగన్ ప్రజాభిప్రాయం సేకరిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version