https://oktelugu.com/

మోదీని ఎదురించే దమ్ము జగన్ కు ఉందా….?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహపూర్వకంగానే మెలుగుతోందనే సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు వైసీపీపై విమర్శలు చేసినా చాలా సందర్భాల్లో వైసీపీ నేతలు సంయమనం పాటించారే తప్ప బీజేపీపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సైతం ఎల్లవేళలా వైసీపీ మద్దతు ప్రకటిస్తూనే ఉంది. అవసరాలకు అనుగుణంగా బీజేపీ వైసీపీ సహాయసహకారాలు అందించుకుంటున్నాయి. అయితే ఇంగ్లీష్ మీడియం విషయంలో మాత్రం వైసీపీ, బీజేపీ నిర్ణయాలు వేరువేరుగా ఉన్నాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 12, 2020 / 02:24 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహపూర్వకంగానే మెలుగుతోందనే సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు వైసీపీపై విమర్శలు చేసినా చాలా సందర్భాల్లో వైసీపీ నేతలు సంయమనం పాటించారే తప్ప బీజేపీపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సైతం ఎల్లవేళలా వైసీపీ మద్దతు ప్రకటిస్తూనే ఉంది. అవసరాలకు అనుగుణంగా బీజేపీ వైసీపీ సహాయసహకారాలు అందించుకుంటున్నాయి.

    అయితే ఇంగ్లీష్ మీడియం విషయంలో మాత్రం వైసీపీ, బీజేపీ నిర్ణయాలు వేరువేరుగా ఉన్నాయి. దీంతో మీడియం విషయంలో జగన్ కు మోదీని ఎదురించే దమ్ము ఉందా….? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధన జరిగే విధంగా చర్యలు చేపడుతోంది. తెలుగు మీడియంను పూర్తిగా రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

    జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయానికి కోర్టుల నుంచి సానుకూలత వ్యక్తం కాకపోయినా జగన్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గడానికి ఇష్టపడలేదు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గడానికి ఇష్టపడటం లేదు. అయితే మోదీ సర్కార్ కొన్ని రోజుల క్రితం నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది.

    మోదీ సర్కార్ మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలని సూచిస్తోంది. మాతృభాషలో విద్యా బోధన ద్వారా విద్యార్థులు మెరుగ్గా రాణించగలగటంతో పాటు మాతృభాషలోనే విషయ పరిజ్ఞానం సాధ్యమవుతుందని మోదీ చెప్పారు. మరి జగన్ మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా ముందుకెళతారా….? లేదా తన నిర్ణయాన్ని మార్చుకుంటారా..? చూడాల్సి ఉంది.