YSR Congress Party: అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా జగన్ మావిగన్ అనే ఊహాజనిత ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే దానిని ఒక గొప్ప ఆలోచనగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజల ఆదరణ మాట దేవుడెరుగు.. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని ముందుకు తీసుకెళ్లే బదులు.. మావిగన్ అనే ప్రతిపాదనను ఎలా మరిపిద్దాం అనేలా వ్యవహరిస్తోంది. మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో మావిగన్ పై చర్చ పెట్టట్లేదు. డిబేట్ లు నిర్వహించడం లేదు. దీనిని ప్రజలు ఎలా మర్చిపోతారా? అనే ఆరాటం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు మావిగన్ అనే ప్రతిపాదనను అసలు జగన్మోహన్ రెడ్డి తేలేదు అన్నట్టు మరిచిపోయారు.
* మూడు రాజధానుల ప్రతిపాదన..
మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమలో హైకోర్టు పెట్టడం ద్వారా న్యాయ రాజధాని చేస్తామని చెప్పింది. అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది. విశాఖను పాలనా రాజధానిగా పేర్కొంది. కానీ చెప్పింది చేయలేక పోయింది. ఇప్పుడు మావిగన్ పేరుతో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుతూ క్యారిడార్ పేరుతో మావిగన్ అనే పేరును ప్రతిపాదించారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనిని ఒక అద్భుత ఆలోచనగా ప్రమోట్ చేయాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అమరావతి ప్రతిపాదన తీసుకొచ్చిన సమయంలోనే.. మావిగన్ ప్రతిపాదన తీసుకు వచ్చుంటే అర్థవంతంగా ఉండేది. ఇంత జరిగాక తేవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. తటస్థులతోపాటు విద్యావంతులు పై ప్రభావం చూపింది.
* దాటవేత ధోరణి
మాజీ మంత్రి రోజా అయితే అమరావతి విషయంలో అభిప్రాయం అడిగితే మావిగన్ రెండు ఒకటే కదా అని సర్దుబాటుతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం మీడియాలో కూడా దీనిపై చర్చ లేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా లేదు. అయితే ఎప్పుడైతే మావిగన్ ఫెయిల్ అయిందో అప్పుడే అమరావతి విషయంలో పాత కోణాలను బయటకు తీస్తారు. దేశంలో నిర్మాణరంగం నిలిపివేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని.. అమరావతి ఆగిపోతుందని కొత్త ప్రచారం ప్రారంభించింది. అమరావతిలో భారీ అవినీతి జరుగుతోందని చెబుతోంది. అసలు మావిగన్ ఊసే లేకుండా పోయింది.