Also Read: మీడియాకు సంకెళ్లా? స్వామి భక్తిపై హైకోర్టు ఆగ్రహం?
రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ నేతలు ఆపాదిస్తున్నారు. ప్రతి విషయంలోనూ బాబుని టార్గెట్ చేయడంతో అసలు అధికారంలో ఉన్నది చంద్రబాబా.. లేక జగనా అనేది ప్రశ్నగా మారింది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి వాటిలో వేటికి స్పందించాలో.. వేటికి స్పందించకుండా ఉండాలో కూడా అధికార పక్ష లీడర్లకు తెలిసుండాలి.
తాజాగా అంతర్వేది ఘటనలో కూడా వైసీపీ నేతలు అదే వైఖరి అవలంబించారు. వైసీపీ కీలక నేతలనైన విజయసాయిరెడ్డి, రోజా లాంటి వారు అంతర్వేది రథం దగ్ధం విషయంలో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ మాట్లాడుతున్నారు. రథం దగ్ధమైన వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టిన ప్రభుత్వమే మొదటి నుంచి పొంతన లేని సమాధానాలు చెబుతోంది. మొదట ఎవరో షార్క్ సర్య్కూట్ అని.. తర్వాత ఆకతాయిల పని అని.. ఆ తర్వాత తేనెపట్టు కోసం వచ్చిన ఎవరో గుర్తు తెలియని వారే ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చింది.
దీనిపై హిందూ సంస్థలు, బీజేపీ, జనసేన పార్టీలు గళం విప్పాయి. దీంతో ప్రభుత్వం తమకు ఎక్కడ నెగెటివ్ వస్తుందోనని తెలుసుకొని సీబీఐ విచారణకు ఆదేశించింది. అటు టీడీపీ నేతలు కూడా అప్పటికే సీబీఐ విచారణ అడిగారు. టీడీపీ నేతలు ఎప్పుడు మాట్లాడినా వైసీపీ నేతల ప్రమేయంపై పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ.. విజయసాయి, రోజా మాత్రం ఏదైనా చంద్రబాబు మీద తోసేయాలి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సవాల్ ను జగన్ స్వీకరిస్తాడా?
అధికార పక్షంలో ఉన్న వారే ఇలా మాట్లాడడంతో ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తోంది. అధికారంలో ఉన్నామని ఎలాంటి విమర్శలు చేసినా వాటిని స్వీకరించడం చాలా కష్టం. పైగా అది రివర్స్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఘటన మీద సరైన ఎంక్వైరీ చేపట్టి.. నిందితులను గుర్తించాల్సింది పోయి ఇలా ప్రతిపక్ష లీడర్లపై విమర్శల దాడికి దిగడం సరైందని కాదని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా వ్యూహాత్మకంగా నడుచుకోవాలని అంటున్నారు.