ఏపీ రాజకీయం మొత్తం ‘రాజధాని’ చుట్టే తిరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి రాజధానిగా అమరావతి ప్రకటించారు. అయితే ఐదేళ్ల కాలంలోనూ ఆయన రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: విజయసాయి, రోజా టాక్ వైసీపీకి రివర్స్ అవుతోందా?
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా సీఎం జగన్ ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు యత్నించడంతో రాజకీయ చిచ్చును రాజేసింది. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతి శాసన రాజధాని, విశాఖను పరిపాలన, కర్నూలును లెజిస్టేటీవ్ రాజధానిగా ప్రకటించారు. అందుకనుగుణంగా జగన్ సర్కార్ ముందుకెళుతోంది.
జగన్ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ మాత్రం ఏపీకి జిల్లాకో రాజధాని పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదని ఈ అంశం నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. అయితే రాజధాని విషయంలో మాత్రం ప్రతిపక్షాలు జగన్ ను విమర్శిస్తూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు(ఆర్ఆర్ఆర్) అమరావతి రాజధాని విషయంలో జగన్ కు బహిరంగ సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: టీడీపీ గతే వైసీపీకి పడుతుందా?
సీఎం జగన్ అమరావతి నుంచి రాజధానిని తరలిండం కరెక్ట్ కాదని అనేకసార్లు రఘరామకృష్ణ బహిరంగగానే ప్రకటించారు. కాగా తాను నర్సాపురం ఎంపీగా రాజీనామా చేస్తానని.. దీనిని అమరావతి రాజధానికి రెఫరెండంగా జగన్ ప్రకటించాలని కోరారు. జగన్ ఆదేశిస్తే అమరావతి కోసం తాను రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీని ద్వారా రాజధాని అమరావతిగా ఉండాలా? లేదంటే ఏపీకి మూడురాజధానులు ఉండాలనే అనే అంశం తేలిపోతుందని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక వల్ల జగన్ సర్కార్ వచ్చే నష్టం కూడా లేదని తెలిపారు. దీంతో నర్సాపురం ఉప ఎన్నిక ద్వారా జగన్ ప్రజాభిప్రాయం సేకరిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.