https://oktelugu.com/

జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా?

ఏపీలో సంక్షేమ జల్లు కురిపిస్తూ ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు సీఎం జగన్. ఊహకందని రీతిలో పథకాలు ప్రకటిస్తూ అమలు చేస్తూ చేరువ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం జగన్ ను ఆపడం.. ఎదుర్కోవడం ప్రత్యర్థి చంద్రబాబుకు.. టీడీపీకి సాధ్యం కాని పని. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రుల అవినీతి అక్రమాలు వెలికితీస్తూ జగన్ దడపుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు జమిలీ ఎన్నికలకు వెళదామని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ నిర్ణయం చంద్రబాబు పుట్టి ముంచుతోందన్న ప్రచారం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2020 8:36 pm
    Follow us on


    ఏపీలో సంక్షేమ జల్లు కురిపిస్తూ ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు సీఎం జగన్. ఊహకందని రీతిలో పథకాలు ప్రకటిస్తూ అమలు చేస్తూ చేరువ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం జగన్ ను ఆపడం.. ఎదుర్కోవడం ప్రత్యర్థి చంద్రబాబుకు.. టీడీపీకి సాధ్యం కాని పని. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రుల అవినీతి అక్రమాలు వెలికితీస్తూ జగన్ దడపుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు జమిలీ ఎన్నికలకు వెళదామని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ నిర్ణయం చంద్రబాబు పుట్టి ముంచుతోందన్న ప్రచారం టీడీపీలో సాగుతోంది.

    జగన్ ఆ నేతకు న్యాయం చేయలేకపోతున్నారా?

    ముందస్తు ఎన్నికలకు వెళితే ఇప్పుడున్న ఊపులో జగన్ ను ఎదుర్కోవడం కష్టమనే భావన టీడీపీ అధినేత చంద్రబాబులో ఉంది. ఎందుకంటే చంద్రబాబు అనుంగ మీడియా కూడా జగన్ పథకాలను ఇటీవల ప్రశంసించడం విశేషం. ముందస్తు మరో మూడేళ్లకు పెట్టినా అప్పటివరకు టీడీపీ జగన్ కు ధాటిగా నిలబడుతుందా అన్న భయం వెంటాడుతోంది.

    బీజేపీ జమిలీ ఎన్నికల ప్లాన్ ను ముందే పసిగట్టిన వైసీపీ అధిష్టానం ఇప్పటికే 90శాతం హామీలను నెరవేర్చేసింది. మోడీ హవా రోజురోజుకు తగ్గుతుండడం.. కరోనా.. లాక్ డౌన్ ఫెయిల్యూర్.. 20లక్షల ప్యాకేజీ అట్టర్ ఫ్లాప్ కావడం.. చైనాతో వార్ లో మసకబారిన ప్రతిష్టను అధిగమించాలంటే కాంగ్రెస్ దుర్లభ స్థితిలో ఉన్న ఈ టైంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని కమలనాథులు భావిస్తున్నారు.

    నిమ్మగడ్డ గవర్నర్ కు ఏం చెప్పారు?

    2024 వరకు కరోనా ధాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పేదరికం నిరుద్యోగం పెరిగి దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటుందని ఆర్థిక సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అప్పుడు ఎన్నికలకు వెళితే బీజేపీకి భారీ నష్టం. కాంగ్రెస్ అప్పటికీ సర్దుకునే చాన్స్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటాయి. దీంతో 2022లోనే జమిలీ ఎన్నికల దిశగా బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

    ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ కే లాభమని విశ్లేషకులు అంటున్నారు. 2022 నాటికి జగన్ సీఎం అయ్యి మూడేళ్లు అవుతుంది. ఇప్పటికే సంక్షేమంలో దూసుకుపోతున్న జగన్ ఈ రెండేళ్లలో మరిన్ని పథకాలు.. వరాలు కురిపించి.. టీడీపీని బలహీన పరచడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ గెలుపు ఖాయమనే ప్రచారం వైసీపీలో ఉంది. చంద్రబాబును కొట్టాలంటే ముందస్తే బెటర్ అని వైసీపీ కూడా ధీమాతో ఫాస్ట్ గా ముందుకెళుతున్నట్టు తెలిసింది. ఓటమితో నైరాష్యంలో ఉన్న బాబును కోలుకోకముందే దెబ్బకొట్టాలని.. ముందస్తు ఎన్నికలు టీడీపీకే శాపం అని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.