కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ దెబ్బతో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే.. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఆన్ లైన్ క్లాసెస్ ని నిర్వహిస్తున్నాయి. రెగ్యులర్ స్కూల్ లో అయితే ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ ల్యాబ్, స్పోర్ట్స్, ఆర్ట్స్, మెస్, లైబ్రరీ, ట్యూషన్ వంటివి ఫీజులో భాగంగా ఉంటాయి. లాక్ డౌన్ తో స్కూళ్లు రీ ఓపెన్ కాకున్నా, ఆన్లైన్ క్లాస్ లు రన్ చేస్తున్నా మేనేజ్ మెంట్లు అన్ని ఫీజులూ చార్జ్ చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసుల పేరుతో పేరెంట్స్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది పేరెంట్స్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ క్లాసుల వల్ల స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా రాట్లేదని, అయినా ఫీజులన్నీ కట్టాలని మేనేజ్ మెంట్స్ ఫోర్స్ చేస్తున్నాయని వాపోతున్నారు.
ఇప్పటికే కొన్ని స్కూల్స్ ఫీజులు చెల్లించిన స్టూడెంట్స్ కే ఆన్లైన్ లో క్లాసులు వినేందుకు ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చాయి. పేమెంట్ చేస్తే బుక్స్ ఇంటికి పంపిస్తామంటున్నాయి. డిజిటల్ క్లాసులు వినేందుకు ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ డివైజ్ స్కూల్ లోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నాయి.