ఇక నుండి వాహనదారులకు కొత్త రూల్స్!

వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారా? నంబర్ ప్లేటు గుర్తించకుండా ఏవైనా రాతలు రాస్తున్నారా? .. ఇకపై ఇలాంటి ఆటలు సాగవంటున్నది కేంద్ర ప్రభుత్వం. కొత్త నియమాలను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొస్తున్నారు. నంబర్ ప్లేట్‌ లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాన్ని అతికించి వాహనాన్ని నడపడం ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా వాహనాల నంబర్ ప్లేట్లలో ఏకరూపతను తీసుకురావడానికి, 11 వర్గాల వాహనాల నంబర్ ప్లేట్లలో రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి రంగు గురించి విస్తృత ప్రమాణాలను కలుపుకొని ప్రభుత్వం […]

Written By: Neelambaram, Updated On : July 20, 2020 8:43 pm
Follow us on

వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారా? నంబర్ ప్లేటు గుర్తించకుండా ఏవైనా రాతలు రాస్తున్నారా? .. ఇకపై ఇలాంటి ఆటలు సాగవంటున్నది కేంద్ర ప్రభుత్వం. కొత్త నియమాలను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొస్తున్నారు. నంబర్ ప్లేట్‌ లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాన్ని అతికించి వాహనాన్ని నడపడం ఇకపై నేరంగా పరిగణిస్తారు.

దేశవ్యాప్తంగా వాహనాల నంబర్ ప్లేట్లలో ఏకరూపతను తీసుకురావడానికి, 11 వర్గాల వాహనాల నంబర్ ప్లేట్లలో రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి రంగు గురించి విస్తృత ప్రమాణాలను కలుపుకొని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో మరో రెండు నంబర్ ప్లేట్లను చేర్చారు. మొదటిది తాత్కాలిక నంబర్ ప్లేట్, రెండోది డీలర్ వద్ద నిలిపి ఉంచిన వాహనాల నంబర్ ప్లేట్.

ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) లో మార్పులు చేశారు. వాహనాలు పెద్ద అక్షరాలతో ఆంగ్లంలో సంఖ్యల్లో మాత్రమే వ్రాయాలి. తాత్కాలిక నమోదు సంఖ్యలు పసుపు పలకపై ఎరుపు రంగులో వ్రాయాలి. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌కు సంబంధించి 1989 జూన్ లో నోటిఫై చేసిన సవరణకు సంబంధించి స్పష్టత తీసుకురావడానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్తున్నది. రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లో స్పష్టత తీసుకురావడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశామని, నిబంధనలను కొత్తగా ఏమీ జోడించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.

రిజిస్ట్రేషన్ నంబర్ తప్ప మరేమీ నంబర్ ప్లేట్‌ లో రాయకూడదని కూడా స్పష్టం చేశారు. ప్రాంతీయ భాషలో రిజిస్ట్రేషన్ నంబర్లను వాహనాలపై చిన్న అక్షరాలుగా వ్రాయడం ఇప్పుడు చట్టవిరుద్ధం. ఈ నియమాలు ఆయా రాష్ట్రాలు వేలం వేసిన వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్లకు కూడా వర్తిస్తాయి. సాదా కాగితంపై కలిపి వ్రాసిన సంఖ్యలు ఇకపై పనిచేయవు. అలాగే సంఖ్యల పరిమాణం, రంగులు కూడా సీఎంవీఆర్ లో వివరించారు. ఉదాహరణకు, ద్విచక్ర వాహనం, త్రీ వీలర్లు మినహా అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య 65 మిల్లీమీటర్ల ఎత్తు, 10 మిల్లీమీటర్ల మందం .. వాటి మధ్య 10 మిల్లీమీటర్ల అంతరం ఉండాలి.

ప్రమాణాల ప్రకారం వ్రాయని సంఖ్యలు, రహదారిపై వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను స్వయం కదిలే కెమెరాలు పట్టుకోలేవు. నేరస్థులు తాత్కాలిక వాహనాలపై తాత్కాలిక నంబర్ ప్లేట్లను ఉంచడం, అవసరానికి అనుగుణంగా వాటిని తొలగించడం వంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి.