Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మనసు మార్చుకుంటారా? వైసీపీ పెద్దల ప్రయత్నాలు ఫలించేనా?

Byreddy Siddharth Reddy: వైసీపీలో వర్గ విభేదాలపై అధిష్టాన పెద్దలు ద్రుష్టిపెట్టారు. విభేదాలు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని గుర్తించారు. అందుకే నాయకులను పిలిచి మాట్లాడుతున్నారు. ప్రధానంగా రాయలసీమపై ద్రుష్టిసారించారు. అక్కడ సీఎం సొంత సామాజికవర్గం నాయకుల్లో ఎక్కడికక్కడే విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అధిష్టానానికి నలుసు కింద మారారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ తో ఆయనకు విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. […]

Written By: Dharma, Updated On : May 16, 2022 6:57 pm
Follow us on

Byreddy Siddharth Reddy: వైసీపీలో వర్గ విభేదాలపై అధిష్టాన పెద్దలు ద్రుష్టిపెట్టారు. విభేదాలు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని గుర్తించారు. అందుకే నాయకులను పిలిచి మాట్లాడుతున్నారు. ప్రధానంగా రాయలసీమపై ద్రుష్టిసారించారు. అక్కడ సీఎం సొంత సామాజికవర్గం నాయకుల్లో ఎక్కడికక్కడే విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అధిష్టానానికి నలుసు కింద మారారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ తో ఆయనకు విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. వీరి తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయన్న ఉద్దేశంతో వైసీపీ పెద్దలు గతంలో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయితే అవేవీ ఫలితాన్నివ్వలేదు. దీంతో మరోసారి తాజాగా వీరివురు మధ్య సయోధ్యను కుదుర్చేందుకు వారిని విజయవాడ పిలిపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన, కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమ్జాద్‌ బాషా సమక్షంలో ఇద్దరిని సమావేశపరిచారని, గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఇద్దరు కలిసి పాల్గొనాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా ఇద్దరు కలిసి పని చేయాలని సూచించారని తెలుస్తోంది.

Byreddy Siddharth Reddy

ఎమ్మెల్యే ఆర్ధర్ తో విభేదాలు..

బైరెడ్డి సిద్ధార్థ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్యే ఆర్థర్‌ గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమ వర్గం వారికి టికెట్లను ఇప్పించుకునే విషయంలో గొడవలకు సైతం దిగారు. కర్నూలు పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌కు సమీపంలోని ప్రైవేటు హోటల్‌లో సీనియర్‌ నాయకులు ముందే గొడవపడ్డారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు అతి కష్టమ్మీద సయోధ్య కుదిర్చారు. వారి ముందు సరేనంటూ చేతులు కలిపినా తర్వాత ఆర్థర్‌, సిద్ధార్థ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Arthur, Siddharth Reddy

Also Read: AP Senior Leaders: ఆ సీనియర్ నాయకులకు ఏమైంది?..వారి సైలెంట్ వెనుక కారణాలేంటి?

గత ఏడాది మిడ్తూరు మండలంలోని సచివాలయ భవనాల ప్రారంభోత్సవ సమయంలో ఆర్థర్‌, సిద్ధార్థ మధ్య విభేదాలు సమసిపోలేదన్న విషయం మరోసారి బహిర్గతమైంది. దానికి తోడు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఇద్దరు కలిసి సాగడం లేదన్న విషయం వైసీపీ పెద్దలు దృష్టికి వెళ్లింది. ఇలా నియోజకవర్గంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉందని వైసీపీ అధి నాయకత్వం భావించినట్లుంది. ఇప్పటికే గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజల్లో పార్టీ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఇలాంటి సమయంలో నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నాయకులు గొడవ పడటం పార్టీకి అసలు మంచిది కాదని ఇద్దరిని పిలిచి మరీ క్లాస్‌ పీకారని, గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో కలిసి పాల్గొనాలని వైసీపీ పెద్దలు సూచించినట్లు సమాచారం.

టీడీపీలో చేరతారని ప్రచారం

మరోవైపు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ లతో మాట్లాడారని .. నందికొట్కూరుతో కీలక నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించడానికి వారు ఒప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. బైరెడ్డి కుటుంబం సుదీర్ఘ కాలం టీడీపీలోనే ఉండడంతో సిద్ధార్థ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తదితర కారణాలతో తెలుగుదేశం పార్టీ అయితే శ్రేయస్కరమని సిద్ధార్థ్ రెడ్డి భావిస్తున్నారు. వైసీపీ నుంచి తెగతెంపులు చేసుకోవడానికి దాదాపు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అందుకే కీలకమైన ఏపీ శాప్ చైర్మన్ పదవిని కట్టబెట్టినా ఏమంత యాక్టివ్ గా పనిచేయడం లేదు. ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉండడంతో వైసీపీ పెద్దలు పిలవడంతో ఇష్టం లేకపోయినా వెళ్లారని.. ఆయన పార్టీ మారడం దాదాపు ఖయమన్న చర్చ రాజకీయ సర్కిల్ లో మార్మోగుతోంది.

Also Read: YCP Group Clashes Lakkireddypalle: పోలీసుల ఎదుటే వైసీపీ నేతల బాహాబాహీ

Recommended Videos:

Tags