Mahesh Fans Counterattack: ఏపీలో కులాల కుంపట్లు కొత్తేమీ కాదు.. కులాల వారీగా ప్రజలు, పార్టీలు వీడిపోయాయి. ‘మన కులపోడు’ అన్న భావన ఏపీ నేతల్లో ఎక్కువగా ఉంటుందన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయాలు కూడా కులాల వారీగా చీలిపోయాయి. దీని ఆధారంగానే డిప్యూటీసీఎం, మంత్రి పదవులు ఇచ్చేదాకా లొల్లి వెళ్లింది. రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లో ఈ కులజాఢ్యం ఎక్కువే. దీనికి నిదర్శనమే ప్రముఖ వైరల్ వీడియో ‘మన కులపోడే’ అనేది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది. కుల ఫీలింగ్ గురించి ఈ వీడియో చాలా నిర్మొహమాటంగా ఎత్తిచూపింది..
ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ విడుదల తర్వాత అలాంటిదే ఒకటి వెలుగులోకి వచ్చింది. తొలిరోజు మార్నింగ్ షో ముగిసిన వెంటనే ‘సర్కారు వారి పాట’ ఫ్లాప్‌గా నిలిచిందని ‘ఏబీఎన్, మహా ఛానెల్స్ న్యూస్’ దారుణంగా ప్రసారం చేశాయి.. టాలీవుడ్ హీరోలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం వల్లనే రాధే శ్యామ్, ఆచార్య, సర్కారువారి పాట లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఓ రెండు ఛానెల్స్ దుష్ప్రచారం చేశాయి. ఇది ప్రధాన స్రవంతి మీడియా అని పిలవబడే టాప్ చానెల్స్ చేయడం దుమారం రేపింది. పెద్ద మీడియా ఇలా చేయడంపై ఆ హీరోల ఫ్యాన్స్ భగ్గుమన్నారు. భారీగా చానెల్స్ పై ట్రోలింగ్ చేశారు. తప్పు తెలుసుకున్న ఆ న్యూస్ చానెల్స్ దెబ్బకు భయపడి కొద్దిసేపటికే ఆ వీడియోలు తీసివేశాయి. మహేష్ బాబు అభిమానులు ట్రోలింగ్ కు దిగివచ్చాయి. ఆ రెండు ఛానెల్‌ల న్యూస్ బైట్‌లలో సర్కారువారిపాటపై ఎటువంటి నెగెటివ్ లేకుండా చూసుకున్నాయి.

రెండు రోజుల తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని టీవీ9 పేర్కొనడంతో మరోసారి ఈ వివాదం రాజుకుంది. మహేష్ బాబు అభిమానులు విపరీతంగా రెచ్చిపోయారు. టీవీ9పై దారుణ పదాలతో హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఈ ఛానెల్ పై ఎప్పుడూ లేని విధంగా చెత్త పోస్ట్‌లతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. టీవీ9 కార్యాలయానికి ఫోన్లు చేసి బెదిరించినట్టు తెలిసింది. దీంతో సాయంత్రానికి ‘సర్కారు వారి పాట’ రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిందని, తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు దూసుకుపోతున్నాయని ఆ ఛానెల్ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మహేష్ ఫ్యాన్స్ దెబ్బకు ఆ ఛానల్ దిగి రావడంతో ఇప్పుడు అభిమానులు కాస్త కుదటపడ్డారు.
Also Read: Adani: నాట్ ఇంట్రెస్ట్: రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్న అదాని..
కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నందుకే మహేష్ ఫ్యాన్స్ ఏకంగా ఓ ఛానెల్‌పై దాడి చేశారు. అయితే దీనివెనుక ఒక కులం వాళ్లు ఉన్నారని.. వాళ్లే కక్షగట్టి మహేష్ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేశారని సమాచారం. మరో కులానికి చెందిన ముఖ్యమంత్రికి మహేష్ బాబు విలువ ఇవ్వడంతోనే వారంతా రెచ్చిపోయారని తెలిపింది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు ఆ కులపోళ్ల తాటతీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కులాల కుంపట్లలో మహేష్ బాబు సినిమాను తొక్కేస్తారా? అని నిలదీస్తున్నారు.
మహేష్ బాబు అభిమానుల దండయాత్రతో సదురు చానెల్స్, కులపోళ్లు ఇప్పుడు గప్ చుప్ అయ్యారు. సర్కారువారిపాటపై పెట్టిన నెగెటివ్ పోస్టులన్నీ తీసివేస్తున్నారు. కులల కొట్లాటలో మహేష్ సినిమాను బలి చేస్తారా? అని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏది ఏమైనా తెలుగు నాట సినిమాలు, రాజకీయాలు వేరుగా ఉంటేనే వాటికి భవిష్యత్ ఉంటుంది. రాజకీయాల దెబ్బకు పాపం సినిమాలను బలిచేస్తున్నారు. ఈ కులాల గొడవలు, మీడియా, కుట్రలు, కుతంత్రాలతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇబ్బందులు పడుతున్నారు. మహేష్ సినిమాపై కావాలని చేసిన ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారన్నది తేలాల్సి ఉంది. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందన్నది వేచిచూడాలి.
Also Read: KCR vs BJP: కేసీఆర్ ను అధికారంలోంచి దించడం బీజేపీకి సాధ్యమేనా?