Homeజాతీయ వార్తలుBJP: కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలను బిజెపి కూల్చనుందా?

BJP: కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలను బిజెపి కూల్చనుందా?

BJP: కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీజేపీ కుట్ర చేస్తోందా? కర్ణాటక, తమిళనాడును హస్త గతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది నెలల కిందట కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. అధికార బిజెపిని మట్టి కరిపించి మరీ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడానికి కర్ణాటక ఫలితం దోహద పడింది.

ఒక విధంగా చెప్పాలంటే కర్ణాటక తో పాటు తెలంగాణ ఎన్నికలు బిజెపికి షాక్ ఇచ్చాయి. అక్కడ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ఉన్న పర్వాలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రం బిజెపి జీర్ణించుకోలేకపోతోంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్న తరుణంలో ఆ పార్టీ జవసత్వాలు నింపుకోవడం బిజెపికి ఇష్టం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలన్న బిజెపికి కాంగ్రెస్ విజయాలు మింగుడు పడడం లేదు. 2019లో ఎన్నికల తరహాలో ఏకపక్ష విజయం దక్కదని ఆ పార్టీ భయపడుతోంది. కాంగ్రెస్ బలపడితే.. బిజెపి అధికారంలోకి వచ్చిన మిత్రులపై ఆధారపడాల్సి ఉంటుంది. అదే జరిగితే సంచలన నిర్ణయాలు తీసుకునే సమయంలో మిత్రుల మద్దతు తప్పనిసరి. అందుకే బిజెపి కొంచెం వెనక్కి తగ్గుతోంది.

సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల వ్యవధి ఉంది. మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవడం పై బిజెపి దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన కర్ణాటక, తెలంగాణ పై ఫోకస్ పెట్టింది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను అచేతనంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రోజులు పాలన సాగించలేదని.. ఆ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బిజెపి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 65 స్థానాలు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు ఐదు స్థానాలు అధికం. దీంతో అక్కడ మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కర్ణాటకలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి పడగొడుతుందని జెడిఎస్ నేత కుమారస్వామి ప్రకటించడం విశేషం. ఇప్పటికే ఒక మంత్రి అవినీతి కేసుల్లో చిక్కుకున్నారని.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ తప్పించుకోవడానికి వీలు లేకుండా పోతుందని.. అందుకే ఆయన 50 నుంచి 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బిజెపిలో చేరబోతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోనందుని కుమారస్వామి కామెంట్స్ చేయడం విశేషం.

అయితే సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇంతటి సాహసానికి బిజెపి దిగుతుందా? అన్న అనుమానం ఉంది. అదే జరిగితే ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని… అంతటి దుశ్చర్యకు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైనా చేయాలనుకుంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. అధికారంలోకి వచ్చాక… అందుకు తగ్గట్టు పరిస్థితులు అంచనా వేసి బిజెపి రంగంలోకి దిగే అవకాశం ఉంది. అంతవరకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల విషయంలో బిజెపి సైలెంట్ గానే ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ ప్రాంతీయ పార్టీలు పావులు కలిపితే.. వెనుక ఉండి సహకారం అందించేందుకు బిజెపి సిద్దపడే సూచనలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular