Bigg Boss 7 Telugu: లేడీ విలన్ శోభ శెట్టి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యింది. ఈ ఆదివారం నాగార్జున ఆమె ఎలిమినేషన్ ప్రకటించారు. శివాజీ, శోభ డేంజర్ జోన్లో మిగిలారు. వీరిద్దరిలో శోభ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలియజేశారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతూ శోభ శెట్టి కొంచెం వింతగా ప్రవర్తించింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్ గా రియాక్ట్ అయ్యే శోభ శెట్టి… తన ఎలిమినేషన్ ని లైట్ గా తీసుకుంది.
నాకు ముందే తెలుసు అన్నట్లు శోభ ఫీల్ అయ్యింది. ఏడుపులు పెడబొబ్బలు కార్యక్రమం పెట్టలేదు. వీటన్నింటికీ మించి ఆమె శివాజీ కాళ్ళు మొక్కింది. ఈ వారం శివాజీ వెర్సెస్ శోభ అన్నట్లు సాగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. గొడవ ముగిశాక శివాజీ… నా ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడినని, శివాజీ అన్నాడు. అందుకు నాగార్జున క్లాస్ పీకాడు.
తన శత్రువుగా భావించే శివాజీ కాళ్లకు మొక్కిన శోభ శెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండని అన్నది. మరొక విషయం ఏమిటంటే… ఆమె అర్జున్ కి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చింది. నేను బయటకు వెళ్ళాక సపోర్ట్ చేసేది నీకే అని చెప్పడంతో అమర్, ప్రియాంక కంగుతిన్నారు.
సీరియల్ బ్యాచ్ గా అమర్ దీప్, ప్రియాంక, శోభ కలిసి ఆడారు. ఈ సీజన్ మొత్తం వాళ్ళ గేమ్ అలానే సాగింది. సాధారణంగా అమర్ దీప్, ప్రియాంకలకు శోభ సపోర్ట్ చేస్తుందని మనం అనుకుంటాం. కానీ ఆమె అర్జున్ కి సపోర్ట్ చేస్తానని చెప్పింది. శోభ ఎవరికీ అర్థం కాదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఎలిమినేటై బయటకు వచ్చిన శోభకు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఆమె 31.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.
This is called maturity oh sorry spy ki and fans ki pedda parichaym vunna padam kadu anukunta 🤡#BiggBossTelugu#ShobhaShetty#biggbosstelugu7 #Sivajipic.twitter.com/z2oTehpDFK
— ShAnKaR🇮🇳 (@Lite_tesuko_bro) December 10, 2023