Dharmana Prasada Rao: సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు మంచి వాగ్దాటి ఉన్న నేత. ఏ విషయం నైనా స్పష్టంగా చెప్పగలరు. ఇటీవల జగన్ కు మద్దతుగా గొప్ప వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. ఆ సమయంలో పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేసేవారు. కొన్నిసార్లు అసంతృప్త కామెంట్స్ వినిపించేవి. అయితే మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కేసరికి జగన్ గొప్పతనాన్ని బయట పెట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రికి అండగా ఉంటూ బలమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతం అంటే ముందుగా గుర్తొచ్చేది కిడ్నీ వ్యాధులు. వేలాదిమంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రతిరోజు ఏదో ఒకచోట మరణ వార్త వినిపిస్తూనే ఉంది. ఇక్కడ కిడ్నీ వ్యాధులకు మూలాలు అంతు పట్టడం లేదు. అయితే భూగర్భ జలాలే కారణమన్న ఒక వాదన ఉంది. నిర్దిష్ట ప్రామాణికం లేకపోయినా నిపుణులు మాత్రం తాగునీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడు అక్కడ పరిస్థితిని చూసి జగన్ చలించిపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార జలాలను శుద్ధి చేసి ఉద్దానానికి అందించేందుకు డిసైడ్ అయ్యారు. ఇందుకుగాను రూ.700కోట్ల నిధులను కేటాయించారు.2019 సెప్టెంబర్ 6న సమగ్ర ఉద్దానం మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. ఈనెల 15న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రి ధర్మాన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జనసేన అధినేత పవన్ లు ఈ ప్రాంతంలో పర్యటించారని.. ఈ స్థాయి ప్రాజెక్టులను ఎప్పుడైనా పూర్తి చేశారా అంటూ ప్రశ్నించారు. జనం తలరాతలను మార్చిన జగన్ కు మనమంతా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాన్ని తీసుకెళ్లిన అపర భగీరథుడు జగన్ అని ధర్మాన ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం ఈ వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి.
చంద్రబాబు నాటకాలు చూడండి #WhyAPNeedsJagan pic.twitter.com/ibguFoszMp
— (@SurupReddyYSRCP) December 10, 2023