BJP- Janasena – TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పొత్తుల విషయంలో పార్టీల మధ్య తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖరారై పోయినందున టీడీపీ కూడా కలిసేందుకు సిద్ధమవుతోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో టీడీపీకి ప్లాట్ ఫాం లేకుండా పోతుందనే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మూడు పార్టీలు ఏకమైతే జగన్ ను ఓడించడం సులభమవుతుందనే టీడీపీ నేతల మాటలను బీజేపీ నేతలు విశ్వసించడం లేదు. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తమతో కలిసేందుకు ఒప్పుకునేది లేదని చెబుతున్నారు.
దీంతో చంద్రబాబు ఆలోచనలో పడిపోతున్నారు. ఇక మాకు తోడుగా ఉండేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. కలిసి పోటీ చేసి వైసీపీని తుద ముట్టిస్తామని చెబుతున్నా బీజేపీ నేతలు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు పడిపోతున్నారు. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం కలిసి పనిచేయాలనే ధోరణి కబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బీజేపీ మాత్రం స్పష్టమైన విధానం అవలంభించడం లేదు.
Also Read: Ganesh Temple in America: అమెరికాలోనూ ఓ వీధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్ గా నామకరణం
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బలం మరింత పెరగనుంది. ఈ విషయం బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. దీంతోనే వారు టీడీపీతో పొత్తు వద్దని వారిస్తున్నారు. టీడీపీ మాత్రం తాము పొత్తుకు సిద్ధమని ప్రకనటలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో కేంద్ర నాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు.
పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చినందున ఇక టీడీపీ తో పొత్తు అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. తమకు పొత్తు తప్ప వేరే అవకాశం లేదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల విద్యుత్ చార్జీల పెంపు విషయంలో జరిగిన ఆందోళనలో బీజేపీ, జనసేన కలిసి పాల్గొనలేదు. ఎవరికి వారే ఆందోళనలు చేశారు. దీంతో వీరి విషయంలో కూడా అందరికి అనుమానాలు వస్తున్నాయి. పొత్తు ఉన్నప్పుడు కలిసే ధర్నాలు చేయాల్సింది పోయి విడివిడిగా చేయడమెందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మొత్తానికి పొత్తుల విషయంలో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. బీజేపీ, జనసేనతో కలిసేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపుతున్నారు. జగన్ ను ఎదుర్కొనేందుకు జత కట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు వద్దని వారిస్తున్నారు. కానీ అధినాయకత్వం పొత్తుల విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.
Also Read:Loud speakers: మసీదుల్లో లౌడ్ స్పీకర్లు లోపలే వాడుకోవాలని కర్ణాటక మంత్రి హితవు