Uday Kiran Letter: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో స్టార్ హీరో అయిన నటుడు ఉదయ్ కిరణ్. తేజ డైరెక్షన్లో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచయం కావడంతో పాటు స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత పలు సినిమాలు చేసిన ప్రత్యేకత చాటుకున్నాడు ఉదయ్. తన నట జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించినా ఆయన చివరి వరకు హీరోగానే కొనసాగారు. కొన్ని కారణాల వల్ల ఉదయ్ అకాల మరణం చెందారు. ఆయన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో అన్నారు. మరికొందరు చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆందోళన చెంది సూసైడ్ చేసుకున్నారని అన్నారు. ఏదీ ఏమైనా ఓ స్టార్ నటుడు చనిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా మరణం సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన చనిపోయే ముందు ఓ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖ ఇప్పుడు బయటపడడం కలకలం రేపుతోంది.
ఉదయ్ కిరణ్ రాసిన ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఎక్కువగా తన భార్య గురించే రాశారు. ఉదయ్ కిరణ్ నిషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్దికాలంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగింది. అయితే తాను కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన సతీమణి విషయంలో ఆయన ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే…
Also Read: అభినానులనుద్దేశించి సాయిధరమ్ తేజ్ ఆడియో సందేశం
‘నేను మా అమ్మ తరువాత నిన్నే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి నిషిత. అయితే తనకు కొందరు నా గురించి బ్యాడ్ గా చెప్పి నాపై మనసు విరిగేటట్లు చేశారు. అయితే నా భార్యకు నిజం తెలిసేసరికి నేను ఈ భూమ్మీద ఉండకపోవచ్చు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఈ భూమ్మీద ఉండకూడదు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అందుకే మా అమ్మను కలవడానికి నేను ఆమె దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను.’ అని ఉదయ్ కిరణ్ లేఖలో పేర్కొన్నారు.
మొత్తానికి ఉదయ్ కిరణ్ మృతికి కుటుంబ గొడవలే కారణమని తెలుస్తోంది. అయితే ఆయన మరణించినప్పుడు రకరకాల వార్తలు వచ్చాయి. కొందరు చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారని, ఇంకొందరు మరో అమ్మాయిని ప్రేమించారన్న వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ కుటుంబంలో జరిగిన గొడవలను ఉదయ్ కిరణ్ తట్టుకోలేకపోయారని, అందుకే ఆయన సూసైడ్ చేసుకున్నరని లేఖ బయటపడిన సందర్భంంలో చర్చించుకుంటున్నారు.
Also Read: ఫిల్మ్ ఇండస్ట్రికి ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం…