Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సఖ్యత నెలకొంటుందా?

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ కేడర్ ను అదుపులో పెట్టాలని భావిస్తోంది. దీనికి గాను అందరిని ఢిల్లీ పిలిపించుకుని వారితో నేరుగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నారు. అందరు కలిసి కట్టుగా పోరాడాలని సూచిస్తున్నారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలను కాపాడాలని దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూలంకషంగా చర్చించారు. పార్టీ కోసం అందరు ఐక్యంగా […]

Written By: Srinivas, Updated On : April 5, 2022 8:28 am
Follow us on

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ కేడర్ ను అదుపులో పెట్టాలని భావిస్తోంది. దీనికి గాను అందరిని ఢిల్లీ పిలిపించుకుని వారితో నేరుగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నారు. అందరు కలిసి కట్టుగా పోరాడాలని సూచిస్తున్నారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలను కాపాడాలని దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూలంకషంగా చర్చించారు. పార్టీ కోసం అందరు ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఇన్నాళ్లు విభేదాల కారణంగా ప్రజల్లో చులకన అయ్యామని వాపోయారు. ఇకపై ప్రత్యర్థులపై పోరాడుతూ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకునే దిశగా అడుగులు వేయాలని చెబుతున్నారు.

Telangana Congress

ఏ విషయంపైనైనా అనవసరంగా బజారుకెక్కి మాట్లాడొద్దని హితవు పలికారు. ఏదైనా ఉంటే తనతో చర్చించొచ్చని సూచించారు. అంతేకాని పార్టీ పరువు బజారుకీడ్చే పనులు చేయొద్దని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. హద్దులు దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని పిలుపునిచ్చారు. చిల్లర రాజకీయాలు చేస్తూ పార్టీ భవిష్యత్ ను నాశనం చేస్తే ఇక ఉపేక్షించమని చెప్పారు. నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తామని అల్టిమేటం జారీ చేశారు.

Also Read: BJP- Janasena – TDP: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసేనా?

తెలంగాణ కోసం ప్రతి ఇంటి తలుపు తడతాం. వీలైనన్ని సార్లు తెలంగాణలో పర్యటించి నేతల్లో బలం పెంచేందుకు కృషి చేస్తాం. టీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే మన లక్ష్యం. కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. బీజేపీ మతం రంగుతో రాజకీయాలు చేస్తోంది. టీఆర్ఎస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వాటిని తుదముట్టించి మంచి పాలన అందించే దిశగా కాంగ్రెస్ సిద్ధమవ్వాలి.

Telangana Congress

టికెట్ల కేటాయింపుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్ గాంధీతో చర్చించారు. ఆరునెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన ఉండాలన్నారు. టికెట్లను ఇష్టారీతిన అమ్ముకోవద్దని సూచించారు. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని చెబుతున్నారు. కరీంనగర్ లో ఇప్పటికే టికెట్లు కేటాయించారని రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగైతే కష్టమే అని చెప్పారు. దీనిపై ఆందోళన వద్దు. గెలిచే వారికే టికెట్లు కేటాయించి అందరికి న్యాయం చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.

Also Read:Ganesh Temple in America: అమెరికాలోనూ ఓ వీధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్ గా నామకరణం

Tags