Asaduddin Owaisi: ఎంఐఎంను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనే క్రమంలో వచ్చే ఏడాది జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మహారాష్ర్ట, బీహార్ లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ కొన్ని స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, గుజరాత్ లలో కూడా పార్టీని విస్తరించాలనే ఉద్దేశంతో అక్కడ పోటీ చేస్తామని ఆ పార్టీ చీప్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.

అయితే ఎంఐఎం పార్టీతో బీజేపీకి ప్రయోజనాలు కలుగుతున్నాయని ఓ అంచనా. ఉత్తరాదిన ముస్లిం సామాజికవర్గం కాంగ్రెస్ వైపు ఉండేది. కాలక్రమంలో ఆ పార్టీ అగాధంలో పడిపోవడంతో వారి ఓట్లు రాబట్టుకోవాలని ఎంఐఎం భావిస్తోంది. దీంతో ఎంఐఎం పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే బీజేపీకే లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, గుజరాత్ లలో ముస్లిం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకగాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కే పడతాయనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను రంగంలో దింపితే కాంగ్రెస్ పార్టీ ఓట్లనే కొల్లగొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కే నష్టాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో మైనార్టీ వర్గాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఉత్తరాదిలో ఓవైసీతో మిత్రపక్షాలకే దెబ్బ తగిలే సూచనలు కనిస్తున్నాయి. అయితే ఎంఐఎం పోటీతో బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని స్పష్టమవుతోంది. దీంతో ఓవైసీ నిర్ణయంతో బీజేపీ గట్టెక్కుతుందా? లేదా చూడాల్సిందే.