వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?

అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, మీరు గెలిస్తే రాజధాని తరలింపునకు తాము అడ్డుకోబోమని చెప్పారు. ఈ సవాలుపై స్పందించేందుకు వైసీపీ ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చారు. చంద్రబాబు సవాల్ ను అధికార పక్షం స్వీకరించలేదు. మీడియా ద్వారా చంద్రబాబుకు తమ సమాధానం చెప్పారు. దీంతో పిరికి పందలు పారిపోయారని వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. […]

Written By: Neelambaram, Updated On : August 8, 2020 6:51 pm
Follow us on


అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, మీరు గెలిస్తే రాజధాని తరలింపునకు తాము అడ్డుకోబోమని చెప్పారు. ఈ సవాలుపై స్పందించేందుకు వైసీపీ ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చారు. చంద్రబాబు సవాల్ ను అధికార పక్షం స్వీకరించలేదు. మీడియా ద్వారా చంద్రబాబుకు తమ సమాధానం చెప్పారు. దీంతో పిరికి పందలు పారిపోయారని వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Also Read: బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

ఇదిలా ఉంటే చంద్రబాబు తాజాగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. విశాఖను ఎంతో అభివృద్ధి చేశానని, విశాఖ ప్రజలు అంటే తనకెంతో ఇష్టమని చంద్రబాబు ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా మార్చాలని అనుకున్నానని బాబు చెప్పారు. ఈ వ్యాఖ్యలను మంత్రి అవంతి శ్రీనివాసరావు తప్పుబట్టారు. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న చంద్రబాబు విశాఖకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఆర్ధిక రాజధానిగా మార్చేందుకు విశాఖకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని అవంతి కోరారు.

అంతటితో ఆగకుండా విశాఖకు రాజధాని అవసరమో… కాదో తేల్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అవంతి సవాల్ విసిరారు. ఈ సవాల్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. తన సవాల్ కు స్పందించలేదని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఈ సవాల్ ను స్సందించకపోతే అంతే స్థాయిలో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

Also Read: హై కోర్టు స్టే పై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం..!

విశాఖ ప్రజలు ఎంతో మంచి వారని, అమరావతి రైతుల పొట్టగొట్టి తమకు రాజధాని ఇమ్మని విశాఖ జనం ఎప్పటికీ అదగరని వారి తరుపున వకాల్తా పుచ్చుకుని చంద్రబాబే చెప్పడం ఉత్తరాంధ్ర వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని ఏర్పాటు చేస్తామంటే వద్దని ఎవరంటారు? విశాఖనే రాజధానిగా ప్రకటించాలని విభజన సమయంలో ఉద్యమాలు చేశారు. ఆ మాట కొస్తే అన్ని జిల్లాలు ఆ సమయంలో రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది.