https://oktelugu.com/

నాని హీరోయిన్‌కు బంపరాఫర్!

వాణీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్‌కు పరిమితమైన ఈ హీరోయిన్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నాని సరసన ‘ఆహా కళ్యాణం’లో హీరోయిన్‌గా నటించిందామె. నేచురల్‌ స్టార్తో రొమాన్స్‌ పండించింది. వెండితెరపై నాని లిప్‌ లాక్ సీన్‌ చేసింది ఆమెతోనే కావడం విశేషం. 2014లో రిలీజైన ఈ మూవీలో నాని, వాణీ మధ్య పెదవి ముద్దు సన్నివేశాలపై అప్పట్లో తెగ చర్చ నడిచింది. మసాలా ఉన్నప్పటికీ ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 8, 2020 / 06:29 PM IST
    Follow us on


    వాణీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్‌కు పరిమితమైన ఈ హీరోయిన్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నాని సరసన ‘ఆహా కళ్యాణం’లో హీరోయిన్‌గా నటించిందామె. నేచురల్‌ స్టార్తో రొమాన్స్‌ పండించింది. వెండితెరపై నాని లిప్‌ లాక్ సీన్‌ చేసింది ఆమెతోనే కావడం విశేషం. 2014లో రిలీజైన ఈ మూవీలో నాని, వాణీ మధ్య పెదవి ముద్దు సన్నివేశాలపై అప్పట్లో తెగ చర్చ నడిచింది. మసాలా ఉన్నప్పటికీ ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో వాణీ కపూర్ బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ గ్లామర్ ఒలికిస్తూ..

    Also Read: అడిగినంత ఇవ్వలేదని.. చేయనంటుంది !

    రొమాంటిక్‌, బోల్డ్‌ మూవీస్‌లో నటించి పేరు తెచ్చుకుంది. టాప్‌ హీరోల సరసన నటించే చాన్స్‌లు కొట్టేసింది. ‘ఆహా కళ్యాణం’కు ముందే హిందీలో ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’ల నటించిన ఈ ఢిల్లీ బ్యూటీ తర్వాత బేఫికర్లో ప్రేక్షకులకు గ్లామర్ డోస్‌ ఇచ్చింది. లాస్ట్‌ ఇయర్ హృతిక్‌ రోషన్‌, టైగర్ ష్రాఫ్‌ ‘వార్’ మూవీలో హీరోయిన్‌గా చేసి సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, సంజయ్‌ దత్‌ నటిస్తున్న ‘షంషేరా’, అక్షయ్‌ కుమార్ సరసన ‘బెల్‌ బాటమ్‌‌’లో హీరోయిన్‌గ నటిస్తోంది. ఇవి సెట్స్‌పై ఉండగానే వాణీకి మరో లక్కీ చాన్స్‌ వచ్చింది.

    బాలీవుడ్‌లో వైవిధ్య చిత్రాల నటుడిగా ఫుల్‌ సక్సెస్‌లో దూసుకెళ్తున్న ఆయుష్మాన్‌ ఖురానా సినిమాలో నటించే బంపరాఫర్ వాణీని వరించింది. అభిషేక్‌ కపూర్ దర్శకత్వం వహించే ఈ మూవీలో ఆయుష్మాన్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌గా కనిపించనున్నాడు. అతనికి జోడీగా వాణీని ఎంపికచేసినట్టు డైరెక్టర్ అభిషేక్‌ ఇటీవల ప్రకటించాడు. ఆయుష్మాన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్‌ చేశాడు వాణిపై పొగడ్తల వర్షం కురిపించాడు.

    Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

    వాణీ కమిటెడ్‌ యాక్ట్రెస్‌ అని, ఆమెతో నటించడం కోసం ఎదురు చూస్తున్నా అని పేర్కొన్నాడు. మంచి డైరెక్టర్, సక్సెస్‌కు చిరునామా లాంటి హీరోతో అవకాశం రావడంతో వాణీ కపూర్ ఫుల్‌ ఖుషీగా ఉంది. అభిషేక్‌ కపూర్ డైరెక్షన్‌లో పని చేసే చాన్స్‌ ఇంత త్వరగా రావడం తన అదృష్టం అని, టాలెంటెడ్‌ హీరో ఆయుష్మాన్‌తో నటించడం చాలా థ్రిల్లింగ్‌ ఉంటుందని చెప్పింది. ఆల్రెడీ రణ్‌బీర్, అక్షయ్‌తో పని చేస్తోంది. ఇప్పుడు ఆయుష్మాన్‌తో సినిమాకు కూడా ఓకే చెప్పడంతో వాణీ కెరీర్ టర్న్‌ అవడం ఖాయమని బీటౌన్‌ వర్గాలు అంటున్నాయి.