‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఆ సినిమా ఓ మొస్తరుగా ఆడినా.. ‘చందమామ’తో టాలీవుడ్‌లో సెటిలైపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళ్, హిందీలో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోల సరసన కూడా సెట్ అవడం ఆమె ప్లస్ పాయింట్. రామ్‌చరణ్‌తో పాటు మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటించిన రేర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందామె. ‘ఆచార్య’లో కూడా ఆమెనే హీరోయిన్.
Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..
అటు కమల్ హాసన్ సరసన కూడా నటిస్తుందామె. తెలుగు, తమిళ్‌లో ఇప్పటికీ కాజల్ హవా నడుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా.. అందం, అభినయం అంతకంతకూ పెంచుకుంటూ పోతోందామె. ట్రెండ్‌కు తగ్గట్టు వైవిధ్య చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించే ‘లైవ్ టెలీకాస్ట్’ అనే వెబ్ సిరీస్‌కు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ప్రభు ఇటీవలే ప్రకటించాడు.
ఇది ఓ హారర్ వెబ్ సిరీస్ కావడం మరో విశేషం. వెండితెరపై ఈ హాట్ బ్యూటీ ఈ తరహా జోనర్లో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. అది వెబ్ సిరీస్ కావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సిరీస్‌లో కాజల్‌తో పాటు వైభవ్, ఆనంది ఇతర ముఖ్య పాత్రాలు పోషించనున్నారు. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇది హాట్‌స్టార్లో ప్రసారం కానుంది. తొందర్లోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘క్వాంటికో’ హిందీ రీమేక్‌కు కూడా కాజల్ ఒప్పుకుందున్న వార్తలు వస్తున్నాయి. ఇంగ్లిష్‌లో ప్రియాంక చేసిన బోల్డ్ క్యారెక్టర్ను కాజల్ పోషించనుందని సమాచారం.
Also Read: జోనర్ సరే.. పోస్టర్ కూడా కాపీ కొట్టేస్తావా ప్రశాంత్!
ప్రస్తుతానికి ఆచార్య, ఇండియన్2, మోసగాళ్లు, హే సినామికా మూవీస్‌తో కాజల్ ఫుల్ బిజీగా ఉంది. అలాగే, రానా హీరోగా నటించిన ‘అరణ్య’లో కాజల్ ఓ కీలక పాత్ర పోషించిట్టు సమాచారం. ఇందులో ఆమె గిరిజన యువతిగా నటించిందట. గిరిజన సంప్రదాయం ప్రకారం ఆమె బ్లౌజ్ లేని శారీలో కనిపిస్తుందని, దాదాపు 30 నిమిషాల నిడివి పాటు ఉంటే కాజల్ పాత్ర మూవీలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ పూర్తయి, రిలీజ్ రెడీ ఉన్నప్పటికీ ‘అరణ్య’లో కాజల్ పాత్రను కావాలనే రివీల్ చేయలేదట.