క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు కనిపించరేం..?

ఏపీలో జగన్ ప్రభుత్వం సాఫీ సాగుతోంది.. ఎక్కడా ఎలాంటి సమస్య లేదు.. అన్నట్లుగా ఉంటున్నారు. అధికార ప్రజాప్రతినిధులు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భయంకరంగా నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క జగన్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి కరోనా గురించి మాట్లాడడం తప్పఏ ఒక్క ప్రజా ప్రతినిధి ప్రజల గురించి ఆరా తీసినట్లు కనిపించడం లేదని కొందరు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఒకిద్దరు తప్ప మిగతావారందరూ యాక్టివ్ గా […]

Written By: NARESH, Updated On : May 18, 2021 1:54 pm
Follow us on

ఏపీలో జగన్ ప్రభుత్వం సాఫీ సాగుతోంది.. ఎక్కడా ఎలాంటి సమస్య లేదు.. అన్నట్లుగా ఉంటున్నారు. అధికార ప్రజాప్రతినిధులు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భయంకరంగా నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క జగన్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి కరోనా గురించి మాట్లాడడం తప్పఏ ఒక్క ప్రజా ప్రతినిధి ప్రజల గురించి ఆరా తీసినట్లు కనిపించడం లేదని కొందరు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఒకిద్దరు తప్ప మిగతావారందరూ యాక్టివ్ గా లేరని అర్థమవుతోంది.

ప్రజలు ప్రమాదస్థితిలో ఉంటే ప్రభుత్వం అలర్ట్ గా మారాలి. అయితే సీఎం జగన్ మాత్రం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైకి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు.. ఆ విషయం మొన్నటి ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుందని కొందరు నాయకులు సైలెంట్ గా ఉంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవసరమైన సేవ చేసేందుకు మాత్రం నాయకులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిల ఉండగా కొందరు ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో సానుకూలంగా వింటున్నారు. అయితే జగన్ కు సలహా ఇచ్చేంత పని మాత్రం చేయడం లేదు. ఎందుకంటే ఎక్కడ తమ పదవికి ఎసరు పడుతుందోనన్న భయం వారిలో పట్టుకుంది. ఇక జగన్ కూడా తాడేపల్లి పథకాలు ప్రవేశపెడుతూ సమీక్షలు నిర్వహిస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని దృష్టి పెట్టడం లేదంటున్నారు.

మంత్రలు, ఎమ్మెల్యేలు సైతం తమ ఇళ్లకే పరిమితమై తాము ప్రజాప్రతినిధులమన్న విషయం మరిచిపోతున్నారు. ఇక కొన్ని మంత్రులు ఇచ్చిన లెక్కలు, ప్రభుత్వం నిర్వహించిన లెక్కలకు పొంతన లేకపోవడంతో పాలన గాడి తప్పుతుందా..? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ విషయంపై అడిగితే ప్రభుత్వంపై కక్ష అని తోసిపారేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగర్ ప్రజాప్రతినిధులను అలెర్ట్ చేయకపోతే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.