సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ లో ప్రాసరమైన హిందీ వెబ్ సిరీస్ చిత్రం ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సిరీస్ గా కొనసాగింపు గా వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ తెరకెక్కింది. ఇందులో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. సమంత వెబ్ సిరీస్ లో నటించడం ఇదే మొదటిసారి..
ది ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదల చేయడానికి ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా మరింత ఆలస్యమైంది. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మే 19న విడుదల చేయనున్నారు. సమంత పాత్ర పరిచయం ఉంటుందని చెబుతున్నారు.
సినిమాను జూన్ మొదటి లేదా రెండో వారంలో అమేజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సమంత ఇందులో ఉగ్రవాది పాత్రలో కనిపించనుంది. రాజ్ నిడిమోరు, కృష్ణడీకే దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ఇక సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
#TheFamilyMan2 to stream with no cuts.
A little bit of snipping here and there. There is no real change, no big cut. Amazon went through the entire footage of Season 2 with a fine toothcomb to ensure there is nothing politically incorrect in Season 2.
Via: @Bollyhungama pic.twitter.com/XeHa0ssFC7
— LetsCinema (@letscinema) May 17, 2021