
కొవిడ్ పై మనం చేసే పోరాటం ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలని గత ఏడాది కాలంగా జరిగిన ప్రతి సమావేశంలో తాను ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా పై పోరులో మీరంతా కీలకపాత్ర పోషిస్తున్నారని, ఈ పోరాటంలో మీరు ఫీల్డ్ కమాండరస్ అని అధికారులను ప్రధాని ప్రశంసించారు. గత ఏడాది వ్యవసాయ రంగం పై నిషేధం విధించలేదని, అయినా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పంట పొలాల్లో సామాజిక దూరం పాటించిన తీరు తనను విస్మయానికి గురిచేసిందని ప్రధాని పేర్కొన్నారు.