Bandi Sanjay Twist: తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు ముగియనుంది. ఈ సందర్భంగా మహేశ్వరంలో జరిగే బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. దీంతో సభను విజయవంతం చేయాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీ సభకన్నా ఎక్కువ మంది జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్న బండి సంజయ్ ఈ సభ ద్వారా మరింత ఉత్సాహంతో ప్రభుత్వంపై విరుచుకుపడనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని చెబుతున్నారు. అమిత్ షా సభకు కార్యకర్తలను సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి గాను ఇప్పటికే అందరికి ఆదేశాలు వెళ్లాయి. ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అధికసంఖ్యలో తరలి రావాలని చెబుతున్నారు. ఈ సభలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా వేసుకుంటారని ప్రచారం సాగినా అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేస్తున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమైన తరువాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: BJP To Refuse If Jagan Asks: జగన్ అడిగితే కాదనడం బీజేపీకి సాధ్యమా?
అయితే అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరే నేతలెవరనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నా బీజేపీ నేతలు మాత్రం పేర్లు వెల్లడించడం లేదు. దీంతో అమిత్ షభలో ఏం నిర్ణయాలు వెల్లడిస్తారో? రాష్ట్రం కోసం ఏం వరాలు ప్రకటిస్తారో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ తన ఉనికి కాపాడుకునే క్రమంలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను కడిగేస్తోంది. ప్రధాన పోటీ దారుగా టీఆర్ఎస్ నే చేసుకుంటోంది. కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.

రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీ వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విశ్వేశ్వర్ రెడ్డి అందుకే బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో అమిత్ షా సభలో పార్టీలో చేరే ముఖ్య నేతలెవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ముందు పేర్లు వెల్లడిస్తే ట్రాప్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరి పేర్లు కూడా బయటకు రానీయడం లేదు. దీంతో అమిత్ షా సభ సక్సెస్ చేసి బీజేపీలో నూతనోత్తేజం నింపాలని నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ కేంద్రంపై అక్కసు వెళ్లగక్కుతోంది. అవసరమైన చోట వారిని నిలదీసేందుకు ఆరాటపడుతోంది. దీంతో అమిత్ షా పర్యటనలో కేసీఆర్ పై ఏం పాచికలు వేస్తారు? కేసీఆర్ ను నియంత్రణలో ఉంచే ప్లాన్లు ఏవైనా వేస్తారా? టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా ఏం విమర్శలు చేస్తారనే దానిపైనే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ సంగ్రామ యాత్రలో ఇంకా ఏవైనా ట్విస్టులు ఉంటాయా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: Ram Gopal Varma : నా లైఫ్ నా ఇష్టం.. నాలా బతకాలంటే ఆ మూడు వదిలేయాలి: రామ్‌గోపాల్‌వర్మ!!