Homeఆంధ్రప్రదేశ్‌Jagan Requests: బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా ఏపీ.. జగన్ విన్నపాలకు కేంద్రం ఓకే

Jagan Requests: బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా ఏపీ.. జగన్ విన్నపాలకు కేంద్రం ఓకే

Jagan Requests: ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహకారం కొరవడిందన్న వార్తల నేపథ్యంలో ఉపశమనం కలిగించే ఒక నిర్ణయం వచ్చింది. బేజీపీ పాలిత రాష్ట్రాలకు కల్పించే కొన్నిరకాల అరుదైన అవకాశాలు జగన్ సర్కారుకు లభిస్తుండడం విశేషం. జగన్ అడిగిందే తరువాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సమీర్ శర్మ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన సేవలు అవసరమని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలా అడగడం ఆలస్యం ఇలా అనుమతి వచ్చింది. నవంబర్ నెలాఖరు వరకూ ఆయన అదనంగా సీఎస్ పదవిలో ఉంటారు. సమీర్ శర్మ గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్కడికి రెండు నెలల తరువాత అంటే నవంబరు 30న రిటైర్ కావాల్సి ఉంది. కానీ అప్పట్లోనే ఆయనకు ఆరు నెలల పాటు పొడిగించారు. ఇప్పుడు తాజాగా మరో ఆరు నెలల పాటు అవకాశమిచ్చారు. అంటే ఆయన ఈ ఏడాది మొత్తం సర్వీసులో ఉంటారన్న మాట. అయితే ఉమ్మడి ఏపీలో కూడా సీఎస్ లకు పదవీకాలం పొడిగింపు స్వల్పమే. ఆరు నెలలకు మించి పొడిగింపు ఇవ్వరు. గతంలో ఒకసారి మాత్రం కాకి మాధవరావుకు ఏడాది పాటు పొడిగించారు. గతంలో నీలంసాహ్నీకి మూడు నెలల చొప్పున అవకాశమిచ్చారు. ఇప్పడు సమీర్ శర్మకు రెండుసార్లతో ఏకంగా ఏడాది పాటు అవకాశమివ్వడం విశేషం.

Jagan Requests
Sameer Sharma

Also Read: Naga Chaitanya Thank You: జూలై 8న ‘థాంక్యూ’.. చైతు కొత్తగా ట్రై చేశాడు !

పాజిటివ్ గా..

ప్రస్తుతం బీజేపీ పాలిత, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ లైన్ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కారుకు బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా కేంద్రం చూస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విపక్షాలు ఎన్నిరకాలుగా మొత్తుకుంటున్నా.. పక్క తెలంగాణా రాష్ట్రం సీఎం కేసీఆర్ కు రిక్తహస్తం చూపిస్తున్నా జగన్ విషయంలో మాత్రం మోదీ సర్కారు కాస్తా పాజిటివ్ గానే ఉందని పరిణామాలు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు హయాంలో సీఎస్ పదవీ కాలం పొడిగింపునకు మోదీ సర్కారు అనుమతివ్వలేదు. ఎవరికీ పొడిగింపు ఇవ్వకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో తేల్చిచెప్పారు. చంద్రబాబు ఎంత ఒత్తడి చేసినా ససేమిరా అన్నారు. కానీ జగన్ అడిగిన మరు క్షణమే ఆలోచించకుండా పొడిగిస్తూ ఏకంగా ఉత్తర్వులే జారీచేశారు. ఈ పరిణామాలను వైసీపీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అందుకే వైసీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు వెనక్కి తగ్గుతున్నారు. కేంద్ర విధానాలపై సైతం ఆచీతూచి స్పందిస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య చక్కటి అవగాహన ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: NTR Acting: ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన క‌ళాత‌ప‌స్వి !

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular