BJP To Refuse If Jagan Asks: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. పాలకులు అనుకుంటే ఏదైనా చేస్తారు. మనసు పెట్టకపోతే అంతే. తమ వారు అనుకున్న వారికి అందలాలు ఎక్కించడం మన అనుకోకపోతే శంకరగిరి మాన్యాలు పట్టించడం కొత్తేమీ కాదు. పాలకులకు అనుకూలంగా ఉండే అధికారులకు కూడా పానుపులేస్తారు. తమను కాదని ఎదురు తిరిగే వారిని పట్టించుకోరు. ఇలా ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అధికారంలో ఉంటే ఆ దర్జాయే వేరు. ఆ ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. ఆ నిర్ణయాలు ఎవరైనా అమలు చేయాల్సిందే. మరి అలంటి ఘటనే ఒకటి ఏపీలో చోటుచేసుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది చేస్తారు. అనుకోనిది మాత్రం అస్సలు చేయరు అని తెలిసిందే.

Y S Jagan
ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉద్యోగ కాలాన్ని ఆరునెలలు పొడిగించారు. జగన్ కు ఇష్టమైన వాడు కావడంతో ఆయన ఉద్యోగ కాలం పెరుగుతూ పోతోంది. ఇదివరకే ఆరు నెలల పదవీ కాలం పొడిగించగా మరో ఆరు నెలలు పొడిగించి తానేమీటో నిరూపించుకుంటున్నారు. తన కోసం కష్టపడే వారి కోసం ఎంతదాకా అయినా వెళతానని నిరూపిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఆయన సేవలు అవసరమని భావిస్తున్నారు. అందుకే ఆయన పదవీ కాలాన్ని ఏకంగా ఏడాది పాటు పొడిగించి తన ప్రేమను చూపిస్తున్నారు.
సమీర్ శర్మ పదవీ కాలం నవంబర్ 30తో ముగియాలి. కానీ రెండు సార్లు ారు నెలల పాటు పొడిగించడంతో ఆయన పదవి మరో ఏడాది పాటు కొనసాగనుంది. సమీర్ ఉద్యోగ కాలాన్ని పొడిగించాలని ప్రధాని మోడీకి జగన్ లేఖ రాయడమే తరువాయి అనుమతి వచ్చేసింది. దీంతో సమీర్ ఉద్యోగానికి ఢోకా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సమీర్ శర్మ సేవలను ప్రభుత్వం వినియోగించుకోవడానికి మార్గం సుగమం అయింది.

Sameer Sharma
అంటే మనకు కావాల్సిన వారికి ఒకలా మనతో విభేదించే వారి పట్ల మరోలా వ్యవహరించడం జగన్ కు అలవాటే. ఈ క్రమంలో ఉద్యోగుల ఉద్యోగ కాలాన్ని పెంచుతూ వారిని పెంచి పోషిస్తున్న జగన్ పై అందరకి ఆగ్రహం వస్తోంది. ఆయన ఉద్యోగ కాలం అయిపోతే వేరే వాళ్లు వస్తారు కదా అనే అభిప్రాయాలు వస్తున్నా లెక్క చేయడం లేదు. తాననుకున్నది చేయడమే జగన్ ప్రత్యేకత. దీంతో సమీర్ శర్మకు జగన్ అండ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి జగన్ కు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా జగన్ కు కావాల్సింది చేసుకోవడం అలవాటే. పైగా బీజేపీకి కావాల్సింది కూడా ఇవ్వడం చేస్తుంటారు. అందుకే పలు సందర్భాల్లో బీజేపీని కాపాడిన జగన్ పట్ల కేంద్రానికి మంచి అభిప్రాయమే ఉంది. దీంతోనే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నట్లు జగన్ తన పనులు తాను చేసుకుంటూ కేంద్రానికి పరోక్షంగా అండగా నిలవడం తెలిసిందే.
Also Read: Pragathi Hot pics: హాట్ సమ్మర్‌లో ‘చిల్’ ప్రగతి: సోషల్ మీడియాలో నటి రచ్చ.. వైరల్ పిక్స్..!!