https://oktelugu.com/

China: అన్నమో రామచంద్రా.. చైనాలో ఆహార సంక్షోభం ఎందుకొచ్చింది?

China: చైనాలో ఆహార కొరత వేధిస్తోంది. శీతాకాలంోల ఆహార పదార్థాల కొరత వెంటాడొచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ డ్రాగన్ లో కొత్తగా హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో కొత్త సవాలు ప్రజలను వెంటాడుతోంది. కొవిడ్ వ్యాప్తితో ప్రపంచమే భయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆహార కొరత దేశాన్ని పట్టి పీడించనుంది. ప్రకృతి ప్రకోపంతోనే చైనా ఈ దుస్థితికి దిగజారినట్లు తెలుస్తోంది. పాలకుల నిర్ణయాలు ప్రజలను మరింత కుంగదీస్తున్నాయి. ప్రపంచ మానవాళికే దారి చూపిన చైనా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటోంది. […]

Written By: , Updated On : November 3, 2021 / 05:09 PM IST
Follow us on

China: చైనాలో ఆహార కొరత వేధిస్తోంది. శీతాకాలంోల ఆహార పదార్థాల కొరత వెంటాడొచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ డ్రాగన్ లో కొత్తగా హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో కొత్త సవాలు ప్రజలను వెంటాడుతోంది. కొవిడ్ వ్యాప్తితో ప్రపంచమే భయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆహార కొరత దేశాన్ని పట్టి పీడించనుంది. ప్రకృతి ప్రకోపంతోనే చైనా ఈ దుస్థితికి దిగజారినట్లు తెలుస్తోంది. పాలకుల నిర్ణయాలు ప్రజలను మరింత కుంగదీస్తున్నాయి. ప్రపంచ మానవాళికే దారి చూపిన చైనా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటోంది.

China

China Food

చైనా(China) అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో ఆహార కొరతపై ఓ వార్త సంచలనం కలిగిస్తోంది. ఆహార పదార్థాలపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వృథాను తగ్గించి వినియోగాన్ని పెంచుకోవాలని పేర్కొంది. దేశంలో ఏర్పడనున్న సమస్యపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. ఇందులో భాగంగా కాయగూరలను సైతం నిల్వ చేసుకుని వాడుకోవాలని అభిప్రాయపడుతోంది.

చైనాలో ఉన్న నదుల్ని, ఆనకట్టల్ని నీటితో నిల్వ చేసి ఉంచడంతో అక్కడ ఏర్పడిన అధిక వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఆహార సంక్షోభం వెంటాడుతోంది. చైనాలో కురిసిన కుంభవృష్టితో ఊళ్లన్ని మునిగిపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు బొగ్గు ఉత్పత్తిని ఆస్రేలియా నుంచి దిగుమతి చేసుకునే డ్రాగన్ దాంతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో దిగుమతిని రద్దు చేసుకుంది. ఫలితంగా దేశంలో రవాణా సమస్య తలెత్తింది. విద్యుత్ ఉత్పత్తికి డీజిల్ వాడకంతో ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఆస్రేలియాతో ఏర్పడిన తగువు కారణంగా చైనాలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కొరత సైతం డ్రాగన్ కు ఇబ్బందిగా మారింది.

చైనాలో విందు భోజనాలు ఏర్పాటు చేయడంపై కూడా నిషేధం విధించారు. ప్రజలకు సంపూర్ణ ఆహారం అందించే క్రమంలో ఏర్పడే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆహార ఉత్పత్తుల వృథాను అరికడుతూ పొదుపు మంత్రం పాటించాలని హితోపదేశం చేస్తోంది. ఆహార పదార్థాలతో బయో ఇంధనాల తయారు చేసే సంస్థలపై ఆంక్షలు విధిస్తోంది.

Also Red: చైనాను ఎదుర్కోవడానికి భారత్ శక్తి సరిపోతుందా? ఎంతుంది?

‘కరోనా’ ఎక్కడ పుట్టింది? మూలాలు అసాధ్యమేనా?

Tags