Suriya & Jyothika: కోలీవుడ్ స్టార్ కపూల్ సూర్య, జ్యోతికల గురించి అందరికీ తెలిసిందే. తెరపైన, పర్సనల్ జీవితంలో వీరిద్దరూ అనోన్యంగా జీవిస్తుంటారు. ప్రస్తుతం సూర్య సినిమాల్లో దూసుకుపోతుండగా… జ్యోతిక లేడి ఓరియెంటెడ్ పాత్రలో చేస్తూ కుటుంబ బాధ్యతలు తీసుకుంటోంది. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

మా 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ లో 15 కథలు సిద్ధంగా ఉన్నాయి.. వాటిలో థియేటర్లకు ఉపయోగపడే సబ్జెక్టులున్నాయి. ఓటీటీలకు ఫిట్ అయ్యే కథలున్నాయి. కథలో కొత్తదనం ఉంటే మేకర్స్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లా? బయటవాళ్లా అని అసలు పట్టించుకోవడం లేదు. అంతలా కొత్త వారిని సూర్య, జ్యోతిక జంట ఎంకరేజ్ చేస్తూ డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారట..
సూర్యతో కలిసి కథల గురించి చాలా మాట్లాడుకుంటామని.. చాలా పారదర్శకంగా ఉంటామని జ్యోతిక తెలిపింది. ఎందుకంటే గట్టిగా చర్చించుకున్నప్పుడు కథలో ఉన్న దమ్ము బయటపడుతుంది. సూర్య అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరు. నేను వినగానే కొత్తగా ఉందా లేదా అని మాత్రం చూస్తాను.. చాలా వరకూ ఫైనల్ గా నేను చెప్పిన మాటకే అందరూ ఓటు వేస్తారని జ్యోతిక చెప్పుకొచ్చింది.
సూర్య చాలా రోమాటిక్ అని జ్యోతిక హాట్ కామెంట్స్ చేసింది. నన్ను, పిల్లలను బాగా చూసుకుంటారని కీలక విషయాలను చెప్పుకొచ్చింది. ప్రొడక్షన్ హౌస్ లో నా భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పుకొచ్చింది. నాకు నచ్చిన సినిమాలనే ఎంకరేజ్ చేస్తారని చెప్పింది. భార్య మాటకు విలువిస్తారని.. నాతో ఉదయాన్ని కూర్చొని కాఫీ తాగుతారరని.. జాగింగ్ చేస్తామని.. అందుకే ఎంతో మంది అమ్మాయిలు ఆయన్ని ఇష్టపడుతుంటారని సంచలన విషయాలను జ్యోతిక పంచుకుంది.