రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలిచింది అందుకేనా?

రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నా టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ తరపున వార్ల రామయ్య బరిలో నిలిచారు, వైసీపీ అభ్యర్థులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ పోటీ చేశారు. దీంతో ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికలకు పోలింగ్ తప్పనిసరైంది. వాస్తవానికి ఈ పోలింగ్ మార్చి 26న జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వాయిదా వేసి ఈ రోజు నిర్వహిస్తున్నారు. […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 2:33 pm
Follow us on


రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నా టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ తరపున వార్ల రామయ్య బరిలో నిలిచారు, వైసీపీ అభ్యర్థులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ పోటీ చేశారు. దీంతో ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికలకు పోలింగ్ తప్పనిసరైంది. వాస్తవానికి ఈ పోలింగ్ మార్చి 26న జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వాయిదా వేసి ఈ రోజు నిర్వహిస్తున్నారు.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికలకు ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని పార్టీ తెలుసు కునేందుకు బ్యాలెట్ ప్యాపర్ ను పార్టీ నిర్దేశించిన ప్రతినిధికి చూపించి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ చెప్పిన అభ్యర్థికి కాకుండా పొరపాటున మరో అభ్యర్థికి ఓటు వేస్తే అది చెల్లదు. ఆ చర్యకు పాల్పడిన ఎమ్మెల్యేకి పార్టీ నోటీసులు జారీ చేయడం, తప్పు చేశారని భావిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థి కనీసం 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 23 మాత్రమే. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ వీడి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. కారణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీమోహన్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీతో సన్నిహితంగా ఉండటంతో శాసన సభలో టీడీపీ బలం 20కి తగ్గిపోయింది.

రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?

ఒడిపోతామని తెలిసినా టీడీపీ ఎందుకు పోటీ చేసిందంటే రాజ్యసభ ఎన్నికలకు పోటీ అంటే టీడీపీని వీడి వైసీపీతో సన్నిహితంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను అవకాశం దొరికితే చట్టపరంగా ఇరికించవచ్చనే కారణంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి టీడీపీ విప్ జారీ చేసింది. విప్ ను టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కారణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీమోహన్ లకు నోటీసులు పంపింది.