సహజవనరుల్లో ఇసుక కూడా ఒకటి. సహజంగా దొరికే ఈ ఇసుకను కూడా దందాలా మార్చేశారు పలువురు అక్రమార్కులు. ఫ్రీగా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కూడా వ్యాపారం చేస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు ఈ ఇసుక తుఫానే రగులుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఫ్రీగా ఇసుక పాలసీని తీసుకొచ్చింది. అవసరమైన వారు రవాణా ఖర్చులు మాత్రం భరించాల్సి ఉండేది. దీంతో అప్పుడు నిర్మాణ రంగం కూడా ఎంతో మెరుగైంది.
Also Read: దీక్షిత్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీతో ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దీన్ని సరిదిద్దుకునేందుకు ఇసుక విధానంపై సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ.. ఏపీ సర్కార్ భారీ ఎత్తున ప్రకటనలు సైతం ఇచ్చింది. గతంలో కొనసాగిన ఇసుక పాలసీని జగన్ రద్దు చేయడంతో ఇప్పుడు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎక్కడైనా అధికార పార్టీకి చెందిన నేతలే ఈ ఇసుక బిజినెస్‌ను నడిపిస్తుంటారు. దీంతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు చెప్పిందే రేటు.. ఇచ్చిందే ఇసుక అన్నట్లుగా ఉందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఆ మధ్య పాత ఇసుక పాలసీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వైసీపీ నేతలు బ్లాక్‌లో అమ్ముకుని కోట్లకు పడగలెత్తారని టీడీపీ ఆరోపించింది. ఆ తర్వాత ఆన్ లైన్ పేరుతో పూర్తిగా బ్లాక్ మార్కెట్‌దే రాజ్యం అయిపోయింది. ఇసుక అందుబాటులో లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి పెట్టింది. అందుకే ప్రజల నుంచి అభిప్రాయాలు కోరుతోంది.
Also Read: రైతుల కోసం మోడీ మరో గొప్ప పథకం..
ఇసుక పాలసీపై ప్రజల అభిప్రాయాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తోందా అని సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఉచితంగా అందిస్తే ప్రతీ వినియోగదారుడు తీసుకుంటాడు కదా.. మళ్లీ దానికి కొత్త పాలసీ.. కొత్త తలనొప్పులు ఎందుకు..? ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న గేమ్‌లో భాగమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.