అమెరికా పోలీసుల అదుపులో 11 మంది విద్యార్థులు

దేశంలో అక్రమంగా నివసిస్తున్నారని అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులను అరెస్టు చేశారు. బోస్టన్‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, ఫిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంత్లో ఈ అరెస్టులు జరిగాయని తెలుస్తోంది. ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌’ అనే వెలుసుబాటుని ఉపయోగించి వీరు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు చదివే రంగంలో ఒక ఏడాదిపాటు పనిచేసే అవకాశం కల్పిస్తుంది కానీ వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారులు […]

Written By: Suresh, Updated On : October 23, 2020 2:46 pm

Outlaw's hands locked in handcuffs isolated on black

Follow us on

దేశంలో అక్రమంగా నివసిస్తున్నారని అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులను అరెస్టు చేశారు. బోస్టన్‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, ఫిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంత్లో ఈ అరెస్టులు జరిగాయని తెలుస్తోంది. ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌’ అనే వెలుసుబాటుని ఉపయోగించి వీరు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు చదివే రంగంలో ఒక ఏడాదిపాటు పనిచేసే అవకాశం కల్పిస్తుంది కానీ వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.