Telangana: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయకుండా వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు చెల్లించకపోవడంతో ప్రభుత్వం సుమారు రూ. 3 వేల కోట్లు బకాయిలు పడినట్లు తెలుస్తోంది యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు.

ఉన్నత కోర్సులు చదివే విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. దీంతో వారు చేసేది లేక వారు విధించే నిబంధనలకు తలొగ్గే పరిస్థితులు వస్తున్నాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో విద్యార్థుల బాధలు తీరడం లేదు.
Also Read: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి ఓపెన్ సవాల్.. నేను వద్దయితే ఎవర్ని రమ్మంటావ్..?
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి పట్టించుకోవడం లేదు. పదివేల ర్యాంకు లోపు వచ్చిన వారికే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువుకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్వాకంతో చదువులు సాగడం లేదు. ఫలితంగా రాష్ర్టంలో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ప్రభుత్వం సహకరించడం లేదు. దీంతో జీవో నెం. 18 తీసుకొచ్చి ప్రభుత్వం చదువులు సాగకుండా చేస్తోందని విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఫీజులు చెల్లించి వారి చదువులు సాఫీగా సాగేందుకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
Also Read: యూపీలో ఎస్పీకి టీఆర్ఎస్ సపోర్టు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్స్