Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో అధికార గులాబీ పార్టీ, హస్తం పార్టీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో జరిగిన డెవలప్ మెంట్ గురించి కాంగ్రెస్, బీజేపీతో చర్చించడానికి తాను సిద్ధమని మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఎక్కడ చర్చిద్దామో ప్లేస్ చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. అందుబాటులో ఉన్న అన్ని మీడియా, సోషల్ మీడియావర్గాల ద్వారా కేటీఆర్‌తో తాను చర్చకు సిద్ధమని ప్రకటించడంతో పాటు టైం, ప్లేస్ కూడా చెప్పారు. కానీ అదే టైంకు కేటీఆర్ ‘ఆస్క్ కేటీఆర్’పేరుతో ట్విట్టర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులోనూ కొందరు నెటిజన్లు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్‌ను స్వీకరిస్తారా? అని ప్రశ్నించడంతో అందుకు తాను సిద్ధంగా లేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

Revanth Reddy:
అంతటితో ఆగకుండా రేవంత్ ఒక ఫోర్ ట్వంటీ అని అందుకే ఆయనతో చర్చకు రానని చెప్పుకొచ్చారు. కావాలంటే ఆయనతో ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ చర్చిస్తారని నెటిజన్లకు సమాధానం ఇచ్చారు. ( గతంలో నోటుకు నోటు కేసులో రేవంత్‌ను ఇరికించింది స్టీఫెన్‌స్టన్ కాబట్టి) కేటీఆర్ ఇలా అన్నారు. ఈ కామెంట్ రేవంత్‌కు ప్లస్ అవ్వగా కేటీఆర్‌కు మైనస్ అయ్యింది. చర్చకు సిద్దమని సవాల్ విసిరిన కేటీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయాన ఆయనే చర్చకు వస్తే కాదంటున్నారు. అభివృద్ధి గురించి చర్చించడానికి ఫోర్ ట్వంటీ అయితే ఏంటి? ఏదైతే ఏంటి? సాకులు చెప్పి మంత్రి తప్పించుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. నిజంగా టీఆర్ఎస్ పాలనతో డెవలప్ మెంట్ జరిగితే కేటీఆర్ ఇలా వెనకడుకు వేసేవారు కాదని విమర్శిస్తున్నారు.
Also Read: ట్విట్టర్ ట్రెండింగ్స్‌ను చూసి మురిసిపోతున్న టీఆర్ఎస్.. ఇది సరిపోతుందా..?
తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి కేటీఆర్ సమాధానంపై స్పందించారు. తాను కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. నిజానికి కేటీఆర్- రేవంత్ రెడ్డిల మధ్య చర్చల సవాళ్లు, ఛాలెంజ్‌లు విసురుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఎప్పుడు అవకాశం దొరికినా కేటీఆర్‌ను ఇరికించేందుకు రేవంత్ రెడ్డి సిద్దంగా ఉంటారు.
ఇటీవల వైట్ చాలెంజ్ పేరుతో రేవంత్ చేసిన హడావుడికి కేటీఆర్‌కు చాలా ఇబ్బంది పడ్డారు. చివరికు కోర్టుకు వెళ్లి పదేపదే ఆ అంశంపై రేవంత్ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సందు దొరికితే చాలు రేవంత్ కేటీఆర్‌ను ఇరికిస్తూసే ఉంటారు. అందుకే రేవంత్ చర్చకు వస్తానంటే కేటీఆర్ పిచేముడ్ అన్నారని కామెంట్స్ చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు..
Also Read:ఎన్నికల్లో గెలుపే పరమావధి.. ప్రజలను రోడ్డుకీడుస్తున్న పాలనా రాజకీయం…!