https://oktelugu.com/

Modi: మోడీ అంటే ఎందుకంత భయం?

Modi: భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలపై ఓ కన్ను వేసింది. ఇక్కడ వైసీపీ, టీడీపీతో కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీతోనే సమస్యలున్నాయని గుర్తిస్తోంది. ఏపీలో సమస్యలున్నా నిలదీసేందుకు వైసీపీ, టీడీపీ ధైర్యం చేయడం లేదు. దీంతో ఏపీలో అధికారం రాకపోయినా విమర్శలు మాత్రం రావడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీని లక్ష్యంగా చేసుకుని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2021 / 10:34 AM IST
    Follow us on

    Modi: భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలపై ఓ కన్ను వేసింది. ఇక్కడ వైసీపీ, టీడీపీతో కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీతోనే సమస్యలున్నాయని గుర్తిస్తోంది. ఏపీలో సమస్యలున్నా నిలదీసేందుకు వైసీపీ, టీడీపీ ధైర్యం చేయడం లేదు. దీంతో ఏపీలో అధికారం రాకపోయినా విమర్శలు మాత్రం రావడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ఎడాపెడా విమర్శలకు దిగుతోంది.

    YCP and TDP

    ఇటీవల కాలంలో తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై దుమారం రేగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీకి ఎలాంటి ఎదురు లేకపోయింది. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర సమస్యలున్నా వైసీపీ, టీడీపీ మాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో తమ ప్రభుత్వానికి ఢోకా లేదనే ధీమాతో ఉంది.

    జగన్ ప్రభుత్వం టీడీపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుందే కానీ బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. టీడీపీ కూడా వైసీపీనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా పోయాయి. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ఏపీలో ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో తెలియడం లేదు.

    Also Read: Jagan KCR: జగన్‌ విధానాలను కాపీ కొడుతున్న కేసీఆర్‌!

    రాష్ర్ట ప్రయోజనాల విషయంలో రెండు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఏ తీరుగా వ్యవహరిస్తుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అధికారం సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ తెలంగాణ, ఏపీలో పార్టీని గట్టెక్కించేందుకు తన వైఖరిలో ఎలాంటి మార్పులు చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.

    Also Read: Online movie ticket controversy: ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లను ఎందుకు కంట్రోల్ చేస్తోంది.. సినీ పరిశ్రమ పాటిస్తుందా?

    Tags