Bheemla Nayak Movie: “భీమ్లా నాయక్” నుంచి అడవి తల్లి సాంగ్ రిలీజ్…

Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన […]

Written By: Raghava Rao Gara, Updated On : December 4, 2021 1:18 pm
Follow us on

Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.

adavi thalli song out from bheemla nayak movie

Also Read: భీమ్లానాయక్​లో పవన్​ గాత్రం.. రికార్డింగ్​ పూర్తిచేసుకున్న పవర్​స్టార్​?

తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం ఇచ్చింది. ఈ చిత్రం లో నాలుగో పాట అడవి తల్లి మాట ను రిలీజ్ చేశారు. భీమ్లా నాయక్ సోల్ గా ఈ సాంగ్ ను అభివర్ణిస్తున్నారు. సినిమా కధాంశాన్ని ఈ పాటలో చూపించేశారు. ముఖ్యంగా లిరిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది. అలానే ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.

https://twitter.com/SitharaEnts/status/1466990229181456393?s=20

Also Read: “భీమ్లా నాయక్” మూవీ లోని ఫోర్త్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే…