Pushpa: పుష్ప మేకర్స్ చేసిన ఆ తప్పుకు.. చెల్లించక తప్పదు భారీ మూల్యం?

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. అయితే, ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే […]

Written By: Raghava Rao Gara, Updated On : December 4, 2021 1:40 pm
Follow us on

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది.

Pushpa

అయితే, ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే షూటింగ్ ప్రారంభంలోనే హిందీ బక్కులను మేరక్స్ అమ్మేశారు. అమ్మేశారు. గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ రెండేళ్ల క్రితం భారీ ధరకు హక్కులను సొంతం చేసుకుంది. షూటింగ్ ప్రారంభమైన వెంటనే సుకుమార్, అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ థియేట్రికల్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పుష్ప నిర్మాతలు ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాలను మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.  అయితే వారి వల్ల కుదరకపోవడంతో.. అల్లు అర్జున్ స్వయంగా వచ్చి..  సామరస్యంగా సమస్యను పరిష్కరించినట్లు టాక్​. అయితే మేకర్స్ ఈ తప్పుకు కాస్ట్లీ మూల్యం చెల్లించుకోక తప్పట్లేదని అంటున్నారు.

Also Read: ప్రమోషన్స్​ కోసం రంగంలోకి దిగుతున్న ‘పుష్ప’రాజ్​

గోల్డ్​మైన్స్ టెలిఫిల్మ్స్​కు చెందిన మనీశ్​ షా ఇప్పుడు హిందీ వర్షెన్​ను అందిస్తున్నారు. ఏఏ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం విడుదల ఖర్చును భరించాల్సి ఉంటుంది. అయితే గోల్డ్‌మైన్ టెలిఫిల్మ్స్ లాభాల నుండి ప్రధాన వాటాను తీసుకోనుండగా.. ఏఏ ఫిల్మ్స్ చిత్రాన్ని నార్త్​ ఇండియాలో విడుదల చేస్తుందటంతో.. లాభాల్లో కొంత శాతాన్ని పొందుతుందని తెలుస్తోంది.  ఈ ప్రాసెస్​లో మైత్రి మూవీస్​ రిస్క్ భరించక తప్పదని తెలుస్తోంది. అయితే, ఇందులో సంతోషించతగ్గ విషయం ఏంటంటే.. పుష్ప హిందీ హక్కులను ముందుగానే విక్రయించడం వల్ల.. లాభాల్లో కొంత శాతం మైత్రికి వస్తుందని తెలుస్తోంది.

Also Read: బాలీవుడ్ లో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్