Dharma Reddy: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోతోంది. ఉద్యోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ పదవీ కాలం ఏడాది పాటు పెంచి అప్రదిష్ట మూటగట్టుకోగా ప్రస్తుతం టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఇక్కడే కొనసాగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆయన పోతే ఇంకొకరు రారా? ఆయనతోనే పనులు సజావుగా సాగుతున్నాయా అనే వాదనలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. అయినా జగన్ మాత్రం ఆయన ఉద్యోగం కొనసాగించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Allu Arjun Navadeep: బన్నీ సర్‌ప్రైజ్ : హీరో నవదీప్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..
ప్రస్తుతం ఆయన పదవీ కాలం మే 14తో పూర్తవుతోంది. దీంతో ఆయన రక్షణ శాఖలో రిపోర్టు చేయాలి. కానీ ఆయన అక్కడకు వెళ్లడం లేదు. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా ప్రభుత్వం కూడా ఆయన ఉద్యోగ కాలాన్ని పొడిగించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆయన డిప్యూటేషన్ కొనసాగించాలని కేంద్రానికి విన్నపాలు చేస్తోంది. కానీ పీఎంవో మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని ఇక్కడే ఉండేలా చేయాలని చూస్తోంది.
దీనికి ప్రధాన మంత్రి కార్యాలయం మాత్రం అంగీకరించడం లేదు. పీఎంవో అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆయన కేంద్ర సర్వీసులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఆయనను ఇక్కడే ఉంచి ఐఏఎస్ హోదా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మారెడ్డికి రెండేళ్లకు పైగా సర్వీస్ ఉంది. వైసీపీ సర్కారు ధర్మారెడ్డిని కావాలనే తమ వద్ద ఉంచుకునేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
కేంద్ర సర్వీసులకు చెందిన ధర్మారెడ్డి రాష్ట్ర కేడర్ కు ఎలా వస్తారనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. రక్షణ శాఖ ఉద్యోగి కావడంతో ఆయనను టీటీడీలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావించడం ఎంతవరకు సమంజసం అనే సంశయాలు వస్తున్నాయి. కానీ జగన్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. తనకు ఇష్టమైన వారిని ఉంచుకునేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. రెడ్డి కావడంతోనే ఆయనను కొనసాగించేందుకు జగన్ ఇంత పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు.