Somu Veerraju Sensational Comments: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. పొత్తులపై ఎవరికి వారు అంచనాలు వేసుకున్నా అవి ఫలించడం లేదు. దీంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులపై ఎటు తేలడం లేదు. ఫలితంగా టీడీపీకి భయం పట్టుకుంది. తమతో కలిసే వారు ఉండరనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రంలో పరిస్థితులు ఎటు వైపు మళ్లుతాయో తెలియడం లేదు. పవన్ కల్యాణ్ తో మాత్రమే పొత్తు ఉంటుందని కుండబద్దలు కొట్టడంతో బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వీర్రాజు ప్రకటన టీడీపీలో ఆందోళన నెలకొనేలా చేస్తోంది.
Also Read: Mahesh Babu Hard work: మహేష్ కష్టమంతా వృధా.. ఇది ఫ్యాన్స్ కి వ్యథే !
రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే పొత్తులే శరణ్యమని టీడీపీ భావిస్తుంటే బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి ఏంటనే దానిపైనే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ తో పొత్తు ఉంటుందని టీడీపీ ఆశించింది. కానీ పవన్ బీజేపీతోనే ఉండటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు పవన్ కు సంకేతాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేద
ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది. ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధించలేని స్థితి. పొత్తులకేమో పార్టీలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనే దానిపై బాబు తర్జనభర్జన పడుతున్నారు. పార్టీని ఎలా గట్టెక్కించాలనే దానిపై మళ్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ బలోపేతంగా ఉండటంతో దాన్ని ఎదుర్కోవడమెలా అనే సందేహంలో పడిపోతున్నారు. తమకు దిక్కెవరనే ఆలోచనలో ఉన్నారు.
సంక్షేమ పథకాలతో వైసీపీ తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటుంటే టీడీపీ మాత్రం ఏ ఆశ లేకుండా నిర్జీవంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీకి ఆధారం ఎవరు? దాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదెవరు? అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. నారా లోకేష్ కు అంతటి సామర్థ్యం లేదని తేలిపోయింది. ఈ క్రమంలో పార్టీని బతికించే వారి కోసం బాబు అన్వేషిస్తున్నారు. ఆపద కాలంలో పార్టీకి అండగా ఉండే వారి కోసం తాపత్రయడుతున్నారు.
Also Read: Ram Gopal Varma : నా లైఫ్ నా ఇష్టం.. నాలా బతకాలంటే ఆ మూడు వదిలేయాలి: రామ్‌గోపాల్‌వర్మ!!