Homeజాతీయ వార్తలుDelhi Assembly Elections: అభివృద్ధి కాదు.. అవినీతి అంతకన్నా కాదు.. ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదే...

Delhi Assembly Elections: అభివృద్ధి కాదు.. అవినీతి అంతకన్నా కాదు.. ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదే హాట్ టాపిక్! ఎందుకంటే?

Delhi Assembly Elections:  ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఇదే ఊపులో పంజాబ్ లోనూ గెలుపును సొంతం చేసుకుంది. ఐతే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో జరిగే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో దూకుడు మొదలుపెట్టింది. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో హుందాగా మాట్లాడతాడని పేరుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) ఈసారి ఎందుకో లైన్ తప్పినట్టు కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తన పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక.. పక్క రాష్ట్రమైన హర్యానాపై తీవ్రమైన విమర్శలు చేశారు.. హర్యానాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ కొనసాగుతున్నారు. అయితే హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహించే యమునా నది(Yamuna river)లో హర్యానా ప్రభుత్వం ప్రమాదకరమైన కలుషితాలను కలుపుతోందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఒకసారి గా రాజకీయంగా దుమారం చెలరేగింది. అరవింద్ ఆస్థాయిలో ఆరోపణలు చేయడంతో.. దానిని తిప్పి కొట్టడానికి హర్యానా ముఖ్య మంత్రి నాయబ్ సింగ్ రంగంలోకి దిగారు. వెంటనే యమునా నదిలోకి దిగి నీటిని తాగి.. కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చారు. ” యమునా నదిలో విషపూరిత వ్యర్థాలను కలుపుతోందని మా ప్రభుత్వం మీద అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. నేను ఇప్పుడు ఆ నీటిని తాగాను. ఆరోపణలు చేసిన వ్యక్తి తదుపరిగా ఏం మాట్లాడతారో నేను చూడాలని భావిస్తున్నానని” నాయబ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ప్రధాని స్పందించారు

యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషపూరిత పదార్థాలు కలుపుతోందని కేజ్రీవాల్ ఆరోపించిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (prime minister Narendra Modi) స్పందించారు. “అరవింద్ చేసిన ఆరోపణలు దేశానికే అవమానకరం.. హర్యానాలో ఉన్న ప్రజల బంధువులు ఢిల్లీలో నివసిస్తున్నారు. అలాంటిది సొంత ప్రజలు తాగే నీళ్లల్లో విషం ఎందుకు కలుపుతారు. యమునా నదిలో నీటిని న్యాయమూర్తులు, దౌత్యవేత్తలు, పేద ప్రజలు తాగుతున్నారు. ఆ నీటిని నేను కూడా తాగుతున్నాను. అలాంటిది హర్యానా ప్రభుత్వం యమునా నీటిలో విషాన్ని ఎందుకు కలుపుతుందని” ప్రధాని ప్రశ్నించారు. మరోవైపు యమునా నదిలో విష పదార్థాలు కలుపుతోందని హర్యానా ప్రభుత్వంపై అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సోనే పాట్ ప్రాంతంలో బిజెపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు. మరి ఇప్పటికైనా ఈ వివాదం ముగుస్తుందో? లేక ఇంకా కొనసాగుతుందో? వేచి చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular