Chiranjeevi Mother : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి నేటితో 86వ సంవత్సరం లోకి అడుగుపెట్టింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో కానీ, జనాలకు కోహినూర్ వజ్రాలు లాంటి కుమారులను అందించింది. సామాన్య మధ్యతరగతి గృహిణి గా ఆమె పిల్లలకు నేర్పిన సంస్కారం, క్రమశిక్షణ నేడు ఎంతోమందికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం అందించే చెయ్యి గా నిల్చింది. అంతే కాకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని చూసి ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వారసులను మన తెలుగు సినిమాకి అందించి ఎనలేని పుణ్యాన్ని మూటగట్టుకుంది. ఎలాంటి గాడ్ ఫాదర్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, స్వయంకృషి తో ఎంత ఎత్తుకి ఎదిగాడో మన అందరం చూసాము. సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా కొనసాగిన ఆయన, సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతోమందికి ఆపన్నహస్తం లాగా నిలిచాడు. రాజకీయాల్లో కాస్త ఓపిగ్గా ఉండుంటే ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు.
ఇక ఆమె రెండవ కుమారుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతూ, గొప్పగా పరిపాలిస్తూ ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు, భక్తులే ఉంటారు. అలాంటి అభిమాన ఘనాన్ని సంపాదించుకున్న బిడ్డకు జన్మనించింది ఆమె. ఇక ఆమె మనవడు రామ్ చరణ్ మన తెలుగు సినిమా గర్వపడేలా ఎంత గొప్పగా నటించి మన ఇండస్ట్రీ కి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినీ నటుడిగా రామ్ చరణ్ ప్రస్థానం చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే గొప్పది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతర దేశాల్లో ఈయనకి మంచి మార్కెట్ ఉంది. అందుకే గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అలాగే అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి నీడలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నేడు పాన్ ఇండియన్ మెగాస్టార్ గా మారిపోయాడు.
అదే విధంగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ లు అందుకొని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లంతా ఇలా ఈరోజు ఉన్నారంటే అందుకు మూలకారణం అంజనా దేవి గారే. నేడు ఆమె పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఇంట్లో ఘనంగా జరిపించారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన తో పాటు అంజనమ్మ గారి ఇద్దరు కుమార్తెలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం ఈ వేడుకల్లో హాజరు కాలేకపోయారు. ఇరువురు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఉండడంతో ఈ వేడుకల్లో పాల్గొనలేకపోయారని అంటున్నారు. ఓవరాల్ గా మెగా అభిమానులు ఈ వీడియో ని చూసి సంబరాలు చేసుకుంటూ ఆనందంతో సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అంజనమ్మ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారి మాతృమూర్తి #Anjanamma పుట్టినరోజు వేడుకలు.. #RamCharan voiceover ❤️ @KChiruTweets @AlwaysRamCharan pic.twitter.com/JYpfdoAz2B
— Kakinada Talkies (@Kkdtalkies) January 29, 2025