జనసేన పార్టీ నుండి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాదరావు. ఈ ఒకే ఒక్కడు అధినేత మాట అసలు వినడు. ఓ పక్క జగన్ ని, ఆయన నిర్ణయాలను పవన్ మీడియా వేదికగా సందర్భం వచ్చినప్పుడల్లా ఏకిపారేస్తున్నారు. రాజకీయాలలో జగన్ ని విమర్శించినంతగా మరో నాయకుడిని పవన్ విమర్శించి ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ ఉప్పు-నిప్పు అని చెప్పాలి. జనసేన మొదటిసారి పోటీచేసిన 2019 ఎన్నికలలో పవన్ ఓడిపోయినా..రాజోలు నియోజకవర్గం నుండి సీటు గెలిచి పార్టీని అసెంబ్లీకి తీసుకెళ్లారు రాపాక. ఆ ఒక్క సీటు వలన పవన్ కి ఒరిగేదేమీ లేకున్నా, భవిష్యత్ పై భరోసా కలిగించింది.
టీడీపీకి షాక్ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు..!
ఐతే పవన్ కి ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దానికి కారణం రాపాక వరప్రసాద రావు చర్యలే. ఎమ్ఎల్ఏ గా గెలిచిన నాటి నుండి, ఆయన జగన్ కి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసెంబ్లీ వేదికగా జగన్ పాలనకు ఆయన కితాబు ఇవ్వడం జరిగింది. పార్టీలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్ఎల్ఏ ప్రత్యర్థికి భజన చేయడం, పవన్ కి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో రాపాకకు ఎన్నిసార్లు అంతర్గత చర్చలలో హితబోధ చేసినా, ఫలితం మాత్రం శూన్యం. రాపాక తీరుపై తన స్పందన తెలపాలని మీడియా అనేక సార్లు అడుగగా, పవన్ ముక్తసరిగానే ముగించాడు కానీ…గట్టిగా విమర్శించడం, హెచ్చరించడం చేయలేదు. దీనితో రాజకీయాలలో పవన్-రాపాక అభిప్రాయాలకు పొంతన లేకుండా పోతుంది.
హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?
తాజాగా మరో కీలక వ్యవహారంలో రాపాక జగన్ కి మద్దతుగా నిలిచి, నేనింతే అన్నట్లు ప్రవర్తించారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం జరిగిన ఎలక్షన్స్ లో రాపాక వైసీపీ కి అనుకూలంగా ఓటేశారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం 151 సీట్లు కాగా..రాపాక ఓటుతో కలిపి ఆ పార్టీకి 152 ఓట్లు వచ్చాయి. టీడీపీ విప్ జారీ చేసిన నేపథ్యంలో రెబల్ ఎమ్ఎల్ఏ లు చెల్లని ఓట్లు వేసి తెలివిగా తప్పించుకున్నారు. జనసేన ఎంఎల్ఏ రాపాక మాత్రం ఒకప్పటి మిత్రపక్షమైన టీడీపీని కూడా కాదని…వైసీపీకి ఓటేసి పవన్ కి షాక్ ఇచ్చారు. మరి ఈ పరిణామం తరువాతైనా పవన్ రాపాకపై ఏదైనా చర్య తీసుకుంటారో లేక ఎప్పటిలాగే మౌనం వహిస్తారో చూడాలి.