https://oktelugu.com/

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులపై చర్యలు ఉంటాయా అంటే టీడీపీ నాయకులు మాత్రం ఉంటాయనే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీడీపీ రాజ్యసభ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. అయినా ప్రతిపక్ష నేత తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను రంగంలోకి దింపిన విషయం విధితమే. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకేనని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2020 / 09:44 AM IST
    Follow us on


    రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులపై చర్యలు ఉంటాయా అంటే టీడీపీ నాయకులు మాత్రం ఉంటాయనే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీడీపీ రాజ్యసభ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. అయినా ప్రతిపక్ష నేత తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను రంగంలోకి దింపిన విషయం విధితమే. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకేనని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?

    టీడీపీ ఎమ్మెల్యేలైన వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్, కారణం బలరాంలు కొంత కాలం కిందట టీడీపీని వీడి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమను ప్రత్యేకంగా గుర్తించి సీట్లు కేటాయించాలని శాసన సభ స్పీకర్ ను కోరారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్న చంద్రబాబుకు రాజ్యసభ ఎన్నికలు ఒక అవకాశంగా కనిపించాయి. దీంతో తన అభ్యర్థిని ఎన్నికల్లో బరిలోకి దింపింది.

    అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన అవి చెల్లుబాటు కాకుండా వేశారు. ప్రాధాన్యతా లోతుగా సంఖ్య వేయాల్సిన చోట టిక్ మార్కు పెట్టారు. బ్యాలెట్ పేపర్ పైనా చంద్రబాబుకు వ్యతిరేకంగా కొన్ని వాక్యాలు రాశారు. దీనిని విప్ ధిక్కారంగా పరిగణించలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ విప్‌ను ధిక్కరించిన ముగ్గురు శాసన సభ్యులపై ఫిరాయింపుల చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు తగిన కార్యాచరణ చేపడతామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

    టీడీపీకి షాక్ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు..!

    అదేవిధంగా టీడీపీ దళిత అభ్యర్థిని రంగంలోకి దించడం వల్ల రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఒక్క దళితుడికి అవకాశం ఇవ్వలేదని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టె వ్యూహాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంభించారు. ఎక్కువ మంది వైసీపీ శాసన సభ్యులుగా ఎస్సీ, ఎస్టీలు వున్నా రాజ్యసభలో దళితులకు మొండి చేయి చూపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. బీసీ మంత్రులు ఇద్దరిని డిప్రమోషన్ చేసి సామాజిక న్యాయాన్ని మంటగలిపారని అధికార పార్టీని విమర్శించారు.