https://oktelugu.com/

టీడీపీకి షాక్ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు..!

రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు లెక్కింపులో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు టీడీపీ షాక్ ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో టీడీపీ అభ్యర్థికే ఓటు వేసినప్పటికీ అవి చెల్లుబాటు కాకుండా వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీమోహన్ ముగ్గురు టీడీపీని వీడి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న విషయం విదితమే. టీడీపీ విప్ జారీ చేయడంతోపాటు అందరి ఎమ్మెల్యేలతో పాటు ఈ ముగ్గురికీ నోటీసులు ఇచ్చారు. సీఎం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 19, 2020 / 09:40 PM IST
    Follow us on


    రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు లెక్కింపులో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు టీడీపీ షాక్ ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో టీడీపీ అభ్యర్థికే ఓటు వేసినప్పటికీ అవి చెల్లుబాటు కాకుండా వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీమోహన్ ముగ్గురు టీడీపీని వీడి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న విషయం విదితమే. టీడీపీ విప్ జారీ చేయడంతోపాటు అందరి ఎమ్మెల్యేలతో పాటు ఈ ముగ్గురికీ నోటీసులు ఇచ్చారు.

    సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

    నిబంధనల ప్రకారం ఓటింగ్ లో పాల్గొన్నవారు ఎవరికి ఓట్ వేశారో ఆపార్టీ ప్రతినిధికి చూపించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికే ఓటు వేసినా అది చెల్లుబాటు కాని విధంగా ఒకటి అని అంకె వేయాల్సిన చోట మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్ మార్క్ పెట్టడంతో ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. ఈ విధంగా ఓటు వేయడంతో దీనిపై చర్యలు తీసుకునే అవకాశం టీడీపీకి లేకుండా చేశారు.

    చెల్లకుండా ఓటు వేయాలని వైసీపీ ఆదేశాలు ఇవ్వడంతో రెబెల్ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 175 ఓట్లు ఉండగా 173 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇ.ఎస్.ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, క్వారంటైన్ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. దీంతో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓటు మాత్రమే లభించాయి. దీంతో ఆయన ఓటమి పాలయ్యారు.

    జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

    పోలింగ్‌ సందర్భంగా ఓ ఎమ్మెల్యే బ్యాలెట్‌ పేపర్‌పై రాసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును ప్రశ్నించే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ‘గెలిచేటప్పుడు చంద్రబాబు కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకు ఇచ్చేది?’ అని బ్యాలెట్‌ పేపర్‌పై రాశారు. అయితే అలా రాసిన ఎమ్మెల్యే ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు జనసేన ఎమ్మెల్యే రాపాక రాంప్రసాద్ ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను జనసేనలో ఉన్నానని, తమ ఎవరికి ఓటు వేయాలో చెప్పకపోవడంతో నాకు ఇష్టమైన వ్యక్తికి ఓటు వేశానని చెప్పారు.