
దేశ ప్రధాని మోదీ ఆంధ్రాపై కోపంగా ఉన్నారా..? అసలు ఆ పదమంటే ఆయన ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో.. ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు చాలా మందికి. అసలు మోదీకి ఆంధ్రా అన్న పదం నచ్చదా..? అన్న అనుమానం చాలా మందిలో వ్యక్తం అవుతోంది. ఆయన వరుసగా తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి.
Also Read: కొడాలి నాని.. వివాదాస్పద వ్యాఖ్యల ఖని..!
2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోదీ.. ఏపీలో పర్యటించారు. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన.. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని.. ఢిల్లీకి మించిన రాజధానిని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే తీరా ప్రధాని అయ్యాక తన నోటితో తాను చెప్పిన మాటలను ఎందుకు తుంగలో తొక్కారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదంటున్నారు.. తెలుగు ప్రజలు.
ప్రత్యేక హోదాను పక్కన పెడితే. మోదీ సర్కారు తరువాతి కాలంలో మంచి పనితీరు కనిపించేలా ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సగటు తెలుగోడు తమ ఆవేదనను వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. అసలు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ.. అప్పట్లో ఓ ఉద్యమం ప్రారంభిస్తే.. బాగుండేది. కానీ ఏపీలో రాజకీయ పార్టీలు కంటితుడుపుగా.. వ్యవహరించాయే తప్పా.. ఆంధ్రా ఉనికిని చాటే బ్యాంకు విలీనానికి ఎక్కడా అడ్డు తగిలిన సంఘటనలు లేవు.
ఆంధ్రాబ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకులో కలిసిపోయింది. ఆంధ్రా అన్న పదం కనుమరుగు అయిపోయింది. ఇప్పుడిక విశాఖ ఉక్కు వరకు వచ్చి ఆగారు ప్రధాని మోదీ గారు. నవరత్న కంపెనీల్లో ఒకటి అయిన విశాఖ ఉక్కును 100శాతం ప్రయివేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇదంతా చూస్తుంటే.. అసలు ‘ఆంధ్రా’ అన్న పదం ప్రధాని మోదీకి నచ్చదా..? అన్న ఢిల్లీలోని కేంద్రానికి ఇష్టం ఉండదా..? అన్న కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ఆ మూడు గంటల్లో ఏం జరిగింది..? : పెద్దిరెడ్డిలో ఎందుకీ మార్పు
నిత్యం నీతులు వల్లించే మోదీ.. ఒక భారీ సంస్థను అప్పనంగా ప్రయివేటీకకరణ చేయడం బదులు.. దాన్ని ప్రభావవంతంగా పని చేసేందుకు ఎందురు చర్యలు చేపట్టడం లేదు.. ఆ దిశగా ఎందుకు ఆలోచనలు చేయడం లేదు..? అసలు అమ్మడమే పరమావధిగా తీసుకున్న నిర్ణయం వెనుక అంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం అవ్వడం లేదు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే.. ఆంధ్రా అన్నది ఎక్కడా కనిపించొద్దా..? అన్న సందేహం సగటు తెలుగోడికి రాక మానదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్