https://oktelugu.com/

కేసీఆర్ కు మూడోఫ్రంట్ పై ఎందుకంత ఆరాటం..?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచాడు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంత ఆరాట పడని టీఆర్ఎస్ అధినేత ఇప్పడు ఏదీ తోస్తే అదే అంటున్నాడు.. ఒకవైపు విచ్చలవిడిగా హామీలిస్తూ.. మరోవైపు వరాలు ప్రకటిస్తూ ఎన్నికల ప్రచార జోరును పెంచాడు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమే అని పైకి అంటున్నా లోలోపల మాత్రం దడ పుట్టినట్లు కనిపిస్తోంది. ఇక్కడ జరిగేవి లోకల్ ఎలక్షన్స్.. కానీ కేసీఆర్ మాత్రం మూడో ఫ్రంట్ పెట్టి దేశాన్ని మార్చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నాడు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 01:32 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచాడు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంత ఆరాట పడని టీఆర్ఎస్ అధినేత ఇప్పడు ఏదీ తోస్తే అదే అంటున్నాడు.. ఒకవైపు విచ్చలవిడిగా హామీలిస్తూ.. మరోవైపు వరాలు ప్రకటిస్తూ ఎన్నికల ప్రచార జోరును పెంచాడు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమే అని పైకి అంటున్నా లోలోపల మాత్రం దడ పుట్టినట్లు కనిపిస్తోంది. ఇక్కడ జరిగేవి లోకల్ ఎలక్షన్స్.. కానీ కేసీఆర్ మాత్రం మూడో ఫ్రంట్ పెట్టి దేశాన్ని మార్చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నాడు.. అయితే ఈ ప్రచారం ఎవరి కోసం..? ఎందుకోసం..? అనేది నగరవాసుల్లో అయోమయంగా మారింది.

    Also Read: హైదరాబాదీలకు ఉచితంగా ‘నమస్తే’ పెట్టిన టీఆర్ఎస్

    హైదాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల వాతావరణం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో ఊపు తెచ్చారు. ఓ వైపు రోడ్ షోలు.. మరోవై మీడియాల్లో మీటింగ్ లు పెడుతున్నాడు. మొదటి నుంచి మాకు పోటీ కాంగ్రెస్ అంటున్న కేటీఆర్, ఆ తరువాత ఎంఐఎంను ఢీకొడుతామంటూ చెబుతున్నారు. అయితే ప్రచారంలో మాత్రం బీజేపీ పేరు ఎత్తకుండా మతతత్వ పార్టీ అంటూ విమర్శిస్తున్నారు. అప్పడప్పుడు కేంద్రాన్ని విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు చేసిందేమీ లేదని తెలుపుతున్నాడు.

    ఇక ఇటీవల మెనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్ నగర వాసులపై వరాలు కురిపించారు. అన్ని ఉచితంగా ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పటికే వరద సాయంలో ఎదురుదెబ్బ తిన్న టఆర్ఎస్ ఆ విషయం కూడా ప్రస్తావిస్తూ ఎన్నికలు అయిపోగానే వరదసాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే దేశంలో త్వరంలో మూడో ఫ్రంట్ రాబోతుందని, దానికి తానే నాయకత్వం వహించి దేశ దిశ మారుస్తానని ప్రకటిస్తున్నాడు.

    Also Read: తిరుపతిలో దుబ్బాక ఫలితం వస్తుందా..?

    హైదరాబాద్ పరిధిలోని ప్రజల్లో బీజేపీపై మక్కువ ఏర్పడిందని కేసీఆర్ గ్రహించినట్లు అర్థమవుతోంది. టీఆర్ఎస్ తప్పులను పక్కగా బీజేపీ ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఇదివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఇవి పాత హామీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో అకడక్కడా ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. రెండు రోజుల కింద ఎమ్మెల్యే మైనంపల్లిని రోడ్డు విషయంలో స్థానికులు నిలదీయడంతో సొంత డబ్బులతో రోడ్డు వేస్తానని ఓ పేపర్ పై సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    Also Read: మళ్లీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. వర్కవుట్ అవుతాయా?

    ఇదంతా గమనిస్తున్న కేసీఆర్ ప్రచార వ్యూహాన్ని మార్చారు. తెరపై మూడో ఫ్రంట్ నినాదాన్ని తెచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఎక్కువభాగం చదువుకున్న వారు ఉన్నందున కొందరు కేంద్ర ప్రభుత్వ తీరును కూడా గమనిస్తున్నారు. ఈ సమయంలో అలాంటి వారిని తమవైపు తిప్పుకోవడానికే కేసీఆర్ ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. త్వరలో మూడో ఫ్రంట్ పెట్టి కేంద్రంలో పోరాడుతామని ప్రకటిస్తున్నాడు. కానీ గత ఎన్నికల్లోనూ మూడో ఫ్రంట్ అని ఎగిసిపడ్డ కేసీఆర్ ఆ తరువాత ఆ విషయం మరిచారు. మరి ఇప్పుడు కూడా అదే చేస్తాడా..? లేదా..? చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్