https://oktelugu.com/

ఆన్ లైన్ ట్రెండ్స్ లో దూసుకెళుతున్న మోదీ.. జగన్..!

ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం.. ఈ యుగంలో సోషల్ మీడియాను ఎవరైతే సమర్థవంతంగా వినియోగించుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. దీనిని గుర్తించిన మన నేతలు కూడా సోషల్ మీడియాను తమ రాజకీయ ప్రచారం కోసం విరివిగా వినియోగించుకుంటున్నారు. ఈ మాధ్యమం ద్వారా జనాల్లోకి వెళ్లడం ఈజీ కావడంతో ప్రతీ నేత ఇప్పుడు సోషల్ మీడియా బాట పడుతున్నాడు. Also Read: తిరుపతిలో దుబ్బాక ఫలితం వస్తుందా..? ప్రతీ ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాను […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 01:26 PM IST
    Follow us on

    ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం.. ఈ యుగంలో సోషల్ మీడియాను ఎవరైతే సమర్థవంతంగా వినియోగించుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. దీనిని గుర్తించిన మన నేతలు కూడా సోషల్ మీడియాను తమ రాజకీయ ప్రచారం కోసం విరివిగా వినియోగించుకుంటున్నారు. ఈ మాధ్యమం ద్వారా జనాల్లోకి వెళ్లడం ఈజీ కావడంతో ప్రతీ నేత ఇప్పుడు సోషల్ మీడియా బాట పడుతున్నాడు.

    Also Read: తిరుపతిలో దుబ్బాక ఫలితం వస్తుందా..?

    ప్రతీ ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో రాజకీయ నేతలు కూడా సోషల్ మీడియాలో అకౌంట్లు తీస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాను వాడని నేతలు సైతం కొత్త అకౌంట్స్.. ఖాతాలు తీస్తూ సోషల్ మీడియాను ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు.

    ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తారో వారే ట్రెండింగ్ లోనూ దూసుకెళుతుంటారు. తాజాగా చెక్ బ్రాండ్స్ సంస్థ ఆన్ లైన్ ట్రెండ్స్ ను విశ్లేషిస్తూ దేశంలోని అత్యంత ప్రముఖ పొలిషియన్స్ ఎవరనేది ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 95 రాజకీయ నేతలు.. 500మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల పేర్లను సదరు సంస్థ వెల్లడించింది.

    సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆయన తర్వాత స్థానంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ఏడాది అగస్టు-అక్టోబర్ మధ్య కాలంలో ట్విట్టర్,యూట్యూబ్,గూగుల్ సెర్చ్ తదితర సామాజిక మాద్యమాల్లో మోదీ పేరుపై దాదాపు 2171 ఆన్ లైన్ ట్రెండ్స్ నమోదవగా.. జగన్ పేరుపై దాదాపు 2137ఆన్‌లైన్ ట్రెండ్స్ నమోదవడం విశేషం.

    Also Read: మళ్లీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. వర్కవుట్ అవుతాయా?

    ఈ ఇద్దరి తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ.. సోనియా గాంధీలు ఉన్నారు. బ్రాండ్ వాల్యూలోనూ ప్రధాని మోదీనే టాప్ ఉన్నారు. మోదీ బ్రాండ్ వాల్యూ రూ.336కోట్లు కాగా… ఆ తర్వాతి స్థానాల్లో అమిత్ షా(రూ.335కోట్లు).. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(రూ.328కోట్లు) ఉన్నారు.

    సోషల్ మీడియాలో ఆయా వ్యక్తులపై వ్యతిరేకత.. సెంటిమెంటును కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ పట్ల దాదాపు 25శాతం వ్యతిరేకత ఉన్నప్పటికీ సర్వేచేసిన 95మంది నేతల్లో మోదీ బ్రాండ్ వాల్యూనే అత్యధికంగా ఉన్నట్లు చెక్ బ్రాండ్స్ సంస్థ ప్రకటించడం గమనార్హం. సోషల్ మీడియాలో మోదీ వెనుకలే జగన్ ఉండటంతో వారిద్దరు ఈ మాధ్యమాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్